Home / 18+ / ఈ మూడు చిత్రాలలో ఉన్న సారాంశం ఒక్కటే..??

ఈ మూడు చిత్రాలలో ఉన్న సారాంశం ఒక్కటే..??

మజిలీ:
మన తెలుగు ఇండస్ట్రీ లో ముచ్చటైన దంపతులు అంటే ముందుగా గుర్తోచేది నాగచైతన్య, సమంత.వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’.పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి పని చేసిన చిత్రం కూడాఇదే.ఈ నెల 5న విడుదలైన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా..ఇది మంచి టాక్‌ కూడా అందుకుంది.వాళ్ళ కెరీర్‌లో అరుదైన మైలురాయిగా నిలిచింది మజిలీ. ఈ చిత్రంలో చైతూ.. ప్రేమలో విఫలమైన ఓ క్రికెటర్‌ పాత్రలో నటించగా..సమంత ఎన్ని తప్పులు చేస్తున్నా భర్తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునే భార్య పాత్రలో నటించారు.మంచి కథ, కథనంతో ఓ రొమాంటిక్‌ లవ్‌స్టోరీని కొత్తగా చూపించారు శివ నిర్వాణ.ఈ చిత్రం అటు ఫ్యామిలీ,ఎటూ యూత్ ను బాగా ఆకట్టుకుంది.

 

చిత్రలహరి:
మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని కూడా వరుసగా పరాజయం అయ్యాయి.ప్రస్తుతం దర్శకుడు కిశోర్‌ తిరుమల ధరమ్‌ తేజ్‌ను ‘చిత్రలహరి’ రూపంలో మంచి హిట్ అందించాడు.అయితే ఈ చిత్రం గత వారం విడుదలై మంచి విజయం సాధించింది. జీవితంలో ప్రతిసారీ విఫలమవుతూ.. తానేంటో నిరూపించుకోవడానికి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఓ మంచి పాత్రలో నటించాడు.ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు ఒక మంచి సందేశంమని చెప్పాలి.

 

జెర్సీ:
నేచురల్‌ స్టార్ నాని థానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో విశేషం ఏమిటంటే నాని క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు.కెరీర్‌లో ఓడిపోయిన ఓ వ్యక్తి కుమారుడి అడిగింది ఇవ్వలేక సతమతమవుతూ.. భార్య సంపాదనపై బతుకుతూ.. చివరకు తన కుమారుడి కోసం మళ్లీ జీవితాన్ని ఎలా ప్రారంభించాడు? దీనిని ఎలా సాధించాడు అనే అంశంపై దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ఈ చిత్రాన్ని చూపించాడు.నాని చెప్పిన మాటలు చిత్రానికే హైలైట్‌గా నిలిచాయి.
ఈ ముగ్గురు యువ హీరోలు రీల్‌ లైఫ్‌లో ఓడి.. గెలిచి.. రియల్‌ లైఫ్‌లోనూ విజయపతాకాన్ని అందుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat