ఎక్కడైనా స్మగ్లింగ్ చేస్తే పోలీసులు ఆ దొంగలను అరెస్ట్ చేస్తారు..కాని ఈ పోలీసులు మాత్రం రామచిలుకను అరెస్ట్ చేసారు.పోలీసులు ఏంటీ.. చిలుకను అరెస్ట్ చేయడమేంటి అనుకుంటున్నారు.ఇది నిజమేనండి పోలీసులు నిజంగానే ఆ పక్షిని అదుపులోకి తీసుకున్నారు.ఈ సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది.బ్రెజిల్ లోని పోలీసులు ఎప్పటినుండో స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.కాని ప్రతిసారీ ఆ ముఠాలు బ్రెజిల్ పోలీసులను నుండి తప్పించుకుంటున్నారు.ఎలాగైతోనో మొత్తానికి స్మగ్లింగ్ ముఠా ఉన్న స్థావరాన్ని కనుక్కొని అక్కడ భారీ ఎత్తున కొకైన్ సరఫరా చేస్తున్నారని సమాచారం రావడంతో ఆ ముఠా ఉన్న ఇంటిని రౌండప్ చేసారు.
ఈ విషయం తెలియని స్మగ్లింగ్ టీమ్ వారి పనిలో మునిగిపోయారు.అయితే అక్కడే ద్వారం దగ్గర ఉన్న చిలుక పోలీసుల రాకను పసిగట్టి ముఠాకు సిగ్నల్ ఇచ్చింది.దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు అక్కడి నుండి తప్పించుకున్నారు.వాళ్ళు పారిపోవడానికి చిలుకే సహాయం చేసుంటుందని..దీనికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉంటారని అనుమానించిన పోలీసులు చిలుకను అరెస్ట్ చేసారు.అరెస్ట్ అనంతరం చిలుకను పరీక్షించిన వెటర్నరీ డాక్టర్..పోలీసుల ప్రశ్నలకు అది స్పందించడంలేదని చెప్పారు.