Home / 18+ / వైసీపీ విజయం సాధించడానికి ప్రధాన కారణాలు ఇవే

వైసీపీ విజయం సాధించడానికి ప్రధాన కారణాలు ఇవే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయదుందుభి మోగించనుందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ఎన్నో కారణాలు కనిపిస్తుండగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ గెలవడానికి మాత్రం స్పష్టంగా చాలా కారణాలు కనిపిస్తుండగా వాటిలో 5 కారణాలను బలంగా చెప్తున్నారు.

1.యువత..
యువత జగన్మోహన్ రెడ్డి పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యారు.. జగన్ ప్రత్యేకహోదా కోసం పోరాటంలో భాగంగా యువభేరిలు నిర్వహించడం, తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యువతకు పెద్దపీట వేస్తాననడం, గ్రామ సచివాలయాల్లో యువతకు పెద్దఎత్తున ఉపాధి, పెండింగ్ లో ఉన్న 2లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తాననడంతోపాటు జగన్ పార్టీలో ఉన్న యువ న్యాయకత్వం, సోషల్ మీడియాలో ఎక్కువ యువత ఉండడం, వారు వైసీపీకి మద్దతివ్వడం వైసీపీకి కలిసొచ్చిన మొదటి అంశం.

 

2.జగన్ హామీలు..
జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ప్రతీ పేద వ్యక్తికీ ఎంతగానో ఉపయోగపడేలా ఉన్నాయి. అమ్మఒడి, రైతుకు పెట్టుబడి సాయం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఫించన్ల పెంపు, మద్యపాన నిషేధం వంటివి ప్రజల మనసుకు హత్తుకున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయితే పేదల విద్య, వైద్యానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది సామాన్యుల్లో ఎక్కువగా వినిపించిన మాట..

 

3.పాదయాత్ర..
జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర కూడా వైసీపీకి కలిసొచ్చింది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తన బాధ్యతకు పూర్తిస్థాయి న్యాయం చేస్తూ ప్రజాసమస్యలపై పోరాడుతూ ఉండేవారు.. అయితే జగన్ ని అసెంబ్లీలో మాట్లాడనీయకపోవడంతో జగన్ ప్రజల్లోకి వెళ్లిపోయారు. 341 రోజుల పాటు 3,468 కి.మీ పాదయాత్ర చేసారు.. 2,516 గ్రామాల్లో కోటి 20 లక్షలమందిని నేరుగా కలిసారు. 124 బహిరంగ సభలు నిర్వహించగా ప్రతీ మీటింగ్ లోనూ 60 వేలనుంచి లక్షమంది వరకూ హాజరయ్యారు. పాదయాత్ర సంబంధిత కార్యక్రమాలు వైసీపీకి బాగా ప్లస్ అయ్యాయి.

 

4.ప్రత్యేకహోదా..
ప్రత్యేకహోదా అనే సెంటిమెంట్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది ఒక్క జగన్ మాత్రమే అనేది రాష్ట్ర ప్రజలంతా విశ్వసించారు. ముఖ్యంగా చంద్రబాబు యూటర్న్ లు తీసుకున్నా జగన్ ఒక్కమాటపైనే నిలబడ్డారు. యువభేరిలు, ధర్నాలు, పోరాటాలతో పాటు జగన్ ఆమరణ నిరాహార దీక్షకు సైతం కూర్చున్నారు. దీంతో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి జగన్ తెగువతో నిర్ణయాలు తీసుకుంటారనే భావన ప్రజల్లో కలిగింది.

 

5.జగన్ వ్యక్తిత్వం..
వైసీపీ అనేది ప్రాంతీయపార్టీ కాబట్టి పూర్తిగా నాయకుడిపైనే మొత్తం వ్యవహారం జగన్ చుట్టూనే తిరుగుతుంది. అందుకే టీడీపీ జగన్ ను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించింది. రాష్ట్రంలో ఏం జరిగినా జగన్ కు అండగట్టడం, జగన్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, జగన్ నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేయడం వంటివి చేసారు. అయితే గత పదేళ్లుగా జగన్ ను గమనించిన ప్రజలు ఆయన వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకున్నారు. అక్రమ కేసులకు భయపడని మొండితనం, కాంగ్రెస్ బీజేపీలపై అవిశ్వాసం పెట్టిన డేరింగ్, హత్యాప్రయత్నానికి కూడా భయపడి ధైర్యం, ముఖ్యంగా ఎప్పుడూ మరో పార్టీతో కలిసి వెళ్లాలి అనే ఆలోచన చేయని విధానానికి వైఎస్ కుటుంబ అభిమానులతో పాటు కచ్చితంగా న్యూట్రల్ ప్రజలు కూడా ఆకర్షితులయ్యారనే చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat