Home / 18+ / తనను విమర్శిస్తూ వైబ్సైట్ లో ఆర్టికల్స్ రాసినా, యూట్యూబ్ లో వీడియోలు పెట్టినా బెదిరింపులే

తనను విమర్శిస్తూ వైబ్సైట్ లో ఆర్టికల్స్ రాసినా, యూట్యూబ్ లో వీడియోలు పెట్టినా బెదిరింపులే

టీవీ9 రవిప్రకాశ్ పై కేసు నమోదైన నేపధ్యంలో ఆయన అనుచరులు చేసిన అనేక ఘన కార్యాలు వెలుగుచూస్తున్నాయి.. గతంలో వీరు చానల్‌ అడ్డుపెట్టుకుని చాలా పనులే చేశారట.. ఎప్పుడూ టీవీల్లో ప్రశ్నించాలి.. నిలదీయాలని చెప్పే రవిప్రకాశ్‌ తనను ఎవరైనా ప్రశ్నిస్తే ఏమాత్రం సహించట.. ఎవరైనా అలా చేస్తే వెంటనే ఆయన టీం రంగంలోకి దిగుతారట.. రవిప్రకాశ్‌ను విమర్శిస్తూ వెబ్ సైట్లలో ఆర్టికల్స్ రాసినా, యూట్యూబ్‌లో వీడియోలు పెట్టినా తక్షణం వాటిని తొలగించేలా వారి అనుచరులు రంగంలోకి దిగుతారట.. రవిప్రకాశ్‌, టీవీ9పై వీడియోలు చేసిన చాలా యూట్యూబ్ చానళ్లను ఇలాగే సదరు వ్యక్తులు వేధించారట.. తాజాగా సీనియర్ జర్నలిస్ట్‌ తెలకపల్లి రవి టీవీ9లో పరిణామాలను, శివాజీ షేర్లు ఉందంటూ హడావుడి చేయడం పట్ల తనశైలిలో విశ్లేషిస్తూ ఒక వీడియోను అప్‌లోడ్ చేశారట.

అయితే తెల్లవారే సరికే ఆ యూట్యూబ్ వీడియోపై కాపీరైట్ అంటూ తెలకపల్లి రవికి రవిప్రకాశ్‌ టీం షాక్‌ ఇచ్చింది. సీనియర్ జర్నలిస్టనే గౌరవం కూడా లేకుండా టీవీ9 టీం చేసిన పని చూసి తెలకపల్లి బాధపడ్డారట.. అలాగే చాలాసార్లు తనను విమర్శిస్తూ ఆర్టికల్స్ రాసే వెబ్‌సైట్లకు నోటీసులు ఇవ్వడం, వారికి ఫోన్లు చేసి కేసులు పెడతామని బెదిరించడం వంటివి చేసారని పలువురు చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం ఏకంగా తనపైనే ఎఫ్ఐఆర్ రాసి కేసు పెట్టే పరిస్ధితి వచ్చింది. టీవీ9 యాజమాన్యం రవిప్రకాష్ ను తొలగించినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. మీడియా మొత్తం ఈ ఉదంతంపై విరుచుకుపండింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat