Home / CRIME / లవర్ ముందే లవర్ ను దారుణంగా తాళ్లతో చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్..

లవర్ ముందే లవర్ ను దారుణంగా తాళ్లతో చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్..

దేశంలో అమ్మాయిలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేస్తున్నారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చిన కామాంధులకు భయంలేదు. తాజాగా మైసూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆరుగురు కామాంధులు ప్రియుడి ఎదుటే యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మైసూరు నగర శివార్లలోని లింగాంబుధి చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ లాడ్జిలో పనిచేస్తున్న ఓ యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం రాత్రి వీరిద్దరూ లింగాంబుధి చెరువు వద్దకు కబుర్లు చెప్పుకొనేందుకు వెళ్లారు. అదే సమయంలో ఆరుగురు యువకులు కారులో అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తులో యువతిని చూసిన ఆ కామాంధులు యువకుడిని తాళ్లతో చెట్టుకు కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్ కు ఒడిగట్టారు. సమాచారం అందుకున్న జయపుర పోలీసులు కేసు నమోదు చేశారు. కామాంధుల్ని పట్టుకొనేందుకు మూడు బృందాల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రియుడు, ప్రియురాలు చికిత్స పొందుతున్నారు.