Home / 18+ / అత్యాచారాన్ని వీడియో తీసిన దుండగులు.. దారుణమైన ఘటన

అత్యాచారాన్ని వీడియో తీసిన దుండగులు.. దారుణమైన ఘటన

మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రధాన మంత్రి స్కీమ్ కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామని నమ్మించి 25ఏళ్ల వివాహితపై ఇద్దరు దుండగులు పైశాచికంగా గ్యాంగ్ రేప్‌ చేసారు. ఈ సంఘటన జైపూర్ సిటీకి సమీపంలో నాగౌర్ జిల్లాలో జరిగింది. 25ఏళ్ల మహిళ గ్యాస్ కనెక్షన్ కోసం ప్రయత్నిస్తుండగా మార్చి నెలలో గ్యాస్ కనెక్షన్ కోరుతూ దరఖాస్తు ఇచ్చేందుకు ఓ ఏజెన్సీకి వెళ్లింది. అక్కడ పనిచేసే ముఖేశ్ కుమార్ ధీరూ అనే వ్యక్తి, ఆమెను గుర్తుపెట్టుకుని రెండునెలల తర్వాత మే7న ఆమె ఇంటికి వచ్చి తనతో వస్తే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తానని చెప్పాడు. గ్యాస్ కనెక్షన్ కోసం కుచమాన్ సిటీలో వేలిముద్రలు వేయాలని నమ్మించి అక్కడికి తీసుకెళ్లాడు.

అక్కడ కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తన స్నేహితుడితో కలిసి గ్యాంగ్ రేప్‌ చేసాడు.. అత్యాచారం చేస్తున్నపుడు ఫోన్ లో వీడియో తీసి, స్పృహ వచ్చిన తర్వాత ఆమెకు చూపించి బ్లాక్‌మెయిల్ చేశాడు… పిలిచినప్పుడల్లా రావాలని కండీషన్ పెట్టాడు. స్వగ్రామానికి చేరుకున్న మహిళ 10రోజులపాటు మనసులోనే బాధను భరించింది. ముకేష్ మరోసారి వచ్చి తన కోరిక తీర్చాలని బెదిరిస్తుండటంతో మహిళ ఆ విషయాన్ని తనభర్తకు చెప్పింది. దీంతో వారిద్దరూ కలిసి పోలీసులకు పిర్యాదుచేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముఖేశ్‌ను అరెస్ట్ చేసి అతని మొబైల్‌ స్వాదీనం చేసుకున్నారు. అతని స్నేహితుడైన కిశోర్ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు.