Home / SLIDER / ఎయిర్ టెల్ ఆఫర్-రూ.249 రీచార్జికి రూ.4లక్షలు

ఎయిర్ టెల్ ఆఫర్-రూ.249 రీచార్జికి రూ.4లక్షలు

ప్రముఖ భారతీయ టెలికాం సంస్థ అయిన భార‌తీ ఎయిర్‌టెల్ త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం అదిరిపోయే ఒక బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ కస్టమర్లు రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 ల‌క్ష‌ల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీ ఉచితంగా ల‌భిస్తుంది. అయితే ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న వెంట‌నే క‌స్ట‌మ‌ర్ల‌కు ఒక ఎస్ఎంఎస్ వ‌స్తుంది.

అందులో పాల‌సీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా ఇవ్వాలి.. అనే వివ‌రాలు ఉంటాయి. వాటిని న‌మోదు చేస్తే క‌స్ట‌మ‌ర్ తన ఫోన్ లో ఎయిర్‌టెల్ యాప్ నుంచి పాల‌సీ కాపీని పొంద‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లేదా భార‌తీ ఆక్సా నుంచి ఆ పాల‌సీ ఇష్యూ అవుతుంది అని వాళ్లు తెలిపారు.

ప్లాన్ రూ.249 ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. అలాగే ఎయిర్‌టెల్ టీవీ ప్రిమియం సేవ‌లు జీ5, హూక్ ఉచిత స‌బ్‌స్క్రిప్ష‌న్‌, లైవ్ చాన‌ల్స్‌, సినిమాలు, 1 ఏడాది కాల వ్య‌వధి గ‌ల నార్ట‌న్ మొబైల్ సెక్యూరిటీ సేవ‌లు కూడా ఉచితంగా ల‌భిస్తాయి.దీని వాలిడిటీని 28 రోజులుగా నిర్ణ‌యించారు.