తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చే వ్యక్తుల్లో ప్రముఖుడైన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ వందల కోట్ల రూపాయలు కుమ్మరించినా సామాన్యుడైన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ను ఓడించలేకపోయారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్‌కుమార్ తనపై నమ్మకం, విశ్వాసంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరులో తన ఎన్నిక జీవన్మరణ సమస్య అని ప్రచారంలో చెప్పానని, సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకుని గెలిపించేందుకు కష్టపడండని తానిచ్చిన పిలుపుమేరకు తనను అక్కున చేర్చుకొని గెలిపించడం పట్ల ఏంచేసినా తాను నెల్లూరు ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు. వందలకోట్లు కుమ్మరించినా సామాన్యుడికే మీరు పట్టం కట్టారన్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటూ జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు శుభాభినందనలు తెలిపారు. తొమ్మిది సంవత్సరాలు జగన్ పడిన శ్రమకు ప్రజలిచ్చిన తీర్పుకు ఆ కష్టాలను తొలగించిందని చెప్పారు.