Home / 18+ / జగన్ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు రాంగోపాల్ వర్మ

జగన్ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు రాంగోపాల్ వర్మ

తన జీవితంలో మొట్టమొదటిసారి ఓ రాజకీయ కార్యక్రమానికి వచ్చానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆర్జీవీ వెళ్లారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతోనే వైసీపీకి ప్రజలు భారీగా కట్టంకట్టారన్నారు. జగన్‌ చారిత్రాక విజయం సాధించారని ఆయన ప్రశంసించారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి టీడీపీ ఓటమికి కారణమన్నారు. జగన్‌ మాటల్లోని నిజాయితీ ప్రజలకు కనెక్ట్‌ అయిందని, ఆయనపై ప్రజలు ఎంతో నమ్మకంఎ పెట్టుకుని అఖండ విజయంతో గెలిపించారని వర్మ వివరించారు. జగన్‌ మంచి పరిపాలన అందిస్తారన్న నమ్మకాన్ని రాంగోపాల్‌ వర్మ వ్యక్తంచేశారు. వర్మను చూడగానే వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసారు. లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ నినదించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat