Home / 18+ / మోడి ప్రమాణ స్వీకారానికి తెలుగురాష్ట్రాల సీఎంలు ఎందుకెళ్తున్నారంటే.?

మోడి ప్రమాణ స్వీకారానికి తెలుగురాష్ట్రాల సీఎంలు ఎందుకెళ్తున్నారంటే.?

దేశంలో సంచలన విజయం సాధించిన బీజేపీ మరోసారి భారతదేశ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్రమోడి కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న వారికి ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) నుండి ఫోన్‌కాల్స్‌ అందాయి. పిఎంఒ ఫోన్లు చేసిన వారిలో తెలంగాణనుంచి కిషన్‌ రెడ్డి, కర్ణాటకనుంచి సదానంద గౌడ ఉన్నారు. నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, రవిశంకర్‌ ప్రసాద్‌, అనుప్రియ పటేల్‌, రాందాస్‌ అథావలే, మిత్రపక్ష నేత రాంవిలాస్‌ పాశ్వాన్‌, శివసేననుంచి అర్వింద్‌ సావంత్‌, కైలాస్‌ చౌదరి, కిరణ్‌ రిజిజు, నిత్యానంద్‌ రాయ్‌, రవీంద్రనాథ్‌, బాబుల్‌ సుప్రియో, జితేంద్ర సింగ్‌, అలాగే సురేష్‌ అంగడి, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, పీయూష్‌ గోయల్‌, ప్రహ్లాద్‌ జోషి, జితేంద్ర సింగ్‌, ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వి, హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌, ప్రహ్లాద్‌ పటేల్‌, ప్రకాష్‌ జవదేకర్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, థావర్‌ చంద్‌ గెహ్లాట్‌, పరషోత్తం రూపాలా, కృష్ణన్‌ పాల్‌ గుర్జార్‌, సాధ్వి నిరంజన్‌ జ్యోతి, పోక్రియాల్‌ తదితరులు మోడి మంత్రివర్గంలో ఉన్నారు. కాగా ఈ కార్య్రమంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు పాల్గొననున్నారు. తెలుగురాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కేసీఆర్, జగన్ లు మోడిని కోరనున్నారు.