Home / TELANGANA / వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సులో కేటీఆర్‌కు ఆహ్వానం

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సులో కేటీఆర్‌కు ఆహ్వానం

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సుకు హాజరుకావాల్సిందిగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానం అందింది. అక్టోబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. గత మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సమావేశాల విషయాలపై ఇందులో చర్చించనున్నట్టు తెలిపింది. మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్ ప్రధానాంశంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఫోరం తన ఆహ్వానంలో పేర్కొన్నది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని, ప్రపంచం సైతం భారత్‌లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నదని తెలిపింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నది. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అనేక రంగాల్లో ముందంజ వేసిన విషయాన్ని ఫోరం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఐటీశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఇన్నోవేషన్, టెక్నాలజీ రంగంలో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో ఈ సదస్సుకు హాజరై తన అనుభవాలను పంచుకోవాలని కోరింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat