Home / 18+ / హోస్ట్ నాగార్జున కేఏ పాల్ తో పాటు ఆ ఇద్దరినీ హౌస్ లోకి అనుమతిస్తారా.? వద్దంటారా.?

హోస్ట్ నాగార్జున కేఏ పాల్ తో పాటు ఆ ఇద్దరినీ హౌస్ లోకి అనుమతిస్తారా.? వద్దంటారా.?

బిగ్ బాస్ మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో అదరగొట్టేశాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కంటెస్టెంట్స్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా తరువాత తారక్ షో నడిపించిన తీరు హౌస్ లో జరిగిన పరిణామాలు షోకు బలాన్నిచ్చాయి. సెకండ్ సీజన్ లో హోస్టింగ్ జాబ్ చేసిన నానికి పెద్దగా లాభంరాలేదు. కానీ షో నేర్పిన అనుభవం ఇద్దరి హీరోలకు ఇబ్బందులను తెచ్చిందనే చెప్పుకోవాలి. తారక్ తీరిక లేకుండా గడపడం చాలా కష్టమైంది. ఇక నాని బాగానే కష్టపడినా కొన్ని విమర్శలు అందుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ 3కి దిక్కెవరు అనే పరిస్థితి ఏర్పడిందట.. తారక్, నాని అయితే హోస్ట్ జాబ్ చేయమని ఇప్పటికే క్లారిటీగా చెప్పేశారట. దీంతో టాలీవుడ్ బిగ్ హీరో రొమాంటిక్ హీరో నాగార్జున. చిన్న స్క్రీన్ పెద్ద షో బిగ్ బాస్ కు హోస్ట్ గా ఉండేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.. దీంతో ఎన్టీఆర్, నాని తర్వాత బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

టాలీవుడ్ మన్మధుడిగా అతనికి ఉండే క్రేజ్ బిగ్ బాస్ కు మరింత మైలేజ్ ఇస్తుందనే అంచనాలున్నాయి. ఇక సర్ ప్రైజ్ విజిటర్స్ విషయంలోనూ విలక్షణంగానే నిర్ణయాలు తీసుకుంటోందని తెలుస్తోంది. సర్ ప్రైజ్ స్టార్స్ గా హౌజ్ లోకి రేణు దేశాయ్ ని తీసుకురాబోతున్నారట. హీరోయిన్ గా, టీవీ షోలకు జడ్జిగా చేసిన రేణు దేశాయ్.. సర్ ప్రైజ్ స్టార్ గా కనిపించేందుకు ఓకే కూడా చెప్పారట.. అలాగే ఏపీ ఎలక్షన్స్ లో యూ ట్యూబ్ పొలిటికల్ స్టార్ గా ఉన్న కేఏ పాల్ కూడా సర్ ప్రైజ్ స్టార్ గా ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసే అవకాశాలున్నాయట.. ఎంత కాంట్రవర్సీ ఉంటే ఆ కార్యక్రమాలు అంతలా హిట్ అవుతున్న రోజులివి అందుకే కాంట్రవర్సీ కోసం అందరూ వెంపర్లాడుతున్నారట.. మొత్తం 12 మంది ఎవరనే దానిపై సర్వత్రా ప్రచారం ఊపందుకుంది. ఒకప్పటి హీరోయిన్లు రంభ, సదా, స్నేహ, మంచు లక్ష్మీలు కూడా పాల్గొంటున్నట్టు సమాచారం. అయితే కేఏపాల్ తో పాటు వస్తున్న మరో ఇద్దరు కాంట్రవర్సీ సెలబ్రిటీలను నాగార్జున ఒప్పుకుంటారా లేక వద్దంటారా అనేది వేచిచూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat