ప్రముఖ సాఫ్ట్ వేర్ సేవల సంస్థ అయిన విప్రో ఫౌండర్ ,విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.మరికొద్ది రోజుల్లోనే విప్రో చైర్మన్ పదవీ నుండి విరమణ తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే తాను తీసుకున్న ఈ నిర్ణయం జులై చివరి నుంచి అమల్లోకి వస్తుందని సమాచారం.
అంతేకాకుండా సరికొత్త ఎండీగా అబిదాలి నీముచ్ వ్యవహారించనున్నారని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. అయితే దీనికి ఈ సంస్థ యొక్క వాటాదారుల ఆమోదం పోందాల్సి ఉందని ఆ సంస్థ ప్రకటించింది. అయితే విప్రో బోర్డులో ప్రేమ్ జీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,వ్యవస్థాపక అధ్యక్షుడుగా వ్యవహారిస్తారని విప్రో పేర్కొంది.
ఈ సందర్భంగా అజీం ప్రేమ్ జీ “ఈ ప్రయాణం నాకు సుదీర్ఘమైన సంతృప్తికరమైనది. రానున్న రోజుల్లో దాతృత్వ కార్యక్రమాలపై మరింత శ్రద్ధ చూపించడంతో పాటుగా ఉన్నసమయంలో ఎక్కువగా కేటాయించాలని నిర్ణయించుకున్నాను “అని ఆయన ప్రకటించారు.