Home / 18+ / స్టీల్‌ప్లాంట్‌ లో ఉద్యోగిగా ప్రారంభమై నాలుగుసార్లు ఎమ్మెల్యేగా అనేక రికార్డులు..!

స్టీల్‌ప్లాంట్‌ లో ఉద్యోగిగా ప్రారంభమై నాలుగుసార్లు ఎమ్మెల్యేగా అనేక రికార్డులు..!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన వ్యక్తి ధర్మాన కృష్ణదాస్‌.. శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై 19 వేల 25 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ధర్మాన శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకు ముందు స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2010లో వైసీపీలో చేరి క్రియాశీలకంగా పనిచేసారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో 17 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. దీంతో జిల్లాలో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే గా చరిత్ర సృష్టించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి చేతిలో తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ ప్రజా ఉద్యమాలలో పాలుపంచుకుంటున్నారు. ఈయన బీకాం చదువుకున్నారు.ఈయన బీకాం చదువుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat