Home / 18+ / అధికారులతో చర్చించి, వేగంగా నిర్ణయం.. త్వరితగతిన అమలు.. ఇండియాలో బెస్ట్ సీఎం, రాష్ట్ర భవిష్యత్ అద్భుతం

అధికారులతో చర్చించి, వేగంగా నిర్ణయం.. త్వరితగతిన అమలు.. ఇండియాలో బెస్ట్ సీఎం, రాష్ట్ర భవిష్యత్ అద్భుతం

ఏపీలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై రెగ్యులేటరీ కమీషన్ ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్ధేశం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్న యువ సీఎం విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ప్రైవేటు స్కూళ్ల వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను మూతపెట్టి మరీ సొంత పార్టీనేతలకు చెందిన ప్రైవేటు విద్యాసంస్థలకు అనుమతులిచ్చారు. లక్షల్లో ఫీజులు తల్లితండ్రులకు మోయలేని భారంగా మారాయి. ప్రభుత్వ బడులు అందుబాటులో లేక, ప్రైవేటు స్కూళ్లు తప్ప గత్యంతరం లేనివిధంగా పరిస్థితులను టీడీపీ ప్రభుత్వం కల్పించింది. అర్హతలేని ఉపాధ్యాయులు, వికాసానికి నోచుకోని చదువులతో పిల్లల్లో విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతుంది.

అలాగే ఎల్కేజీకే లక్ష రూపాయిలు కట్టాల్సిన పరిస్థితిలో సామాన్యులు పిల్లలను చదివించుకోలేక అవస్థలు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులపై కనీస నియంత్రణ లేదు. యూనిఫాంలనుంచి పుస్తకాల దాకా తాము చెప్పిన ధరకే కొనాలని షరతులు పెడుతూ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేసాయి. 100 పేజీల నోట్ బుక్ బయట సుమారు రూ.45 ఉంటే చైతన్య లాంటి స్కూళ్లలో రూ.100 ఉంటుంది. విద్యార్థులు ఫీజు, పుస్తకాలు, ఇతర ఖర్చులు కలిపి ఏడాదికి లక్షకు పైగా ఖర్చు చేయాల్సివస్తోంది. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ప్రైవేటుసంస్థల ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఇకపై ఈ దొంగల దోపిడీగా సాగుతున్న ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలకు కళ్లెం వేయనున్నారు సీఎం జగన్. ఎడ్యుకేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు.. భారీ ఫీజులతో విద్యార్థుల తల్లితండ్రులను పీల్చిపిప్పిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతోనే విద్యాసంస్థలు నడపాలని, కాదని అధిక ఫీజులు వసూలు చేస్తే సంస్థలకు తాళాలు వేయాలంటున్నారు.

ఇప్పిటికే నోబ్యాగ్ డే ద్వారా విద్యార్థుల భుజాలపై భారాన్ని తగ్గించిన యువ ముఖ్యమంత్రి త్వరలో నిర్ణయాత్మకంగా ఫీజుల నియంత్రణను అమలు పరుస్తున్నారు. ప్రతి ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారు.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా వాటిని తయారు చేయడం ద్వారా ప్రైవేటు భాగ స్వామ్యాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నారు. అధికారులతో చర్చించి వేగంగా నిర్ణయం తీసుకుని, త్వరగా అమలు చేస్తున్నారు. వీలైనంత త్వరగా జగన్ ఈ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తే భారతదేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా జగన్ కొనియాడబడటం ఖాయం. అలాగే భావితరాల భవిష్యత్తులు కూడా అద్భుతంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat