Home / 18+ / నెలలతరబడి సాగదీయకుండా ఒక్క కేబినేట్ మీటింగ్ లోనే 43 అంశాలను తేల్చేసాడు.. ఏమిటవి.?

నెలలతరబడి సాగదీయకుండా ఒక్క కేబినేట్ మీటింగ్ లోనే 43 అంశాలను తేల్చేసాడు.. ఏమిటవి.?

నెలలతరబడి సాగదీయకుండా ఒక్క కేబినేట్ మీటింగ్ లోనే 43 అంశాలను తేల్చేసాడు.. ఏమిటవి.?ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినేట్ సమావేశం నిర్వహించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ ఏ విషయాన్నీ గంటలపాటు చర్చలు, సమీక్షలు చేయలేదు.. అన్ని అంశాలను విఫులంగా విని అందరి ఆమోదంతో నిర్ణయాలు వేగంగా తీసేసుకున్నారు.

1.అవినీతి రహిత పాలన..ఏయే శాఖల్లో ఎక్కడ అవినీతి జరిగిందో పరిశీలించాలని మంత్రులకు జగన్ ఆదేశించారు.. జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరాం. ఆదిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఏయేశాఖలో అవినీతి జరిగిందోగుర్తించి వాటిని ప్రభుత్వ వెబ్సైట్ లో పొందుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సలహాలు, సూచనలు ఎవరైనా చేయవచ్చన్నారు. అలాగే టెక్నికల్ సపోర్టింగ్ టీమ్ పనులకు సంబంధించిన వివరాలను జ్యుడీషియల్ కమిషన్ ముందు పెడుతుందని, వారి సిఫారసుల్లో ప్రతీఅంశాన్ని  ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించారు.

2. తన ప్రభుత్వంలో మంత్రులు డమ్మీలు కారని ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసారు..  ఏ మంత్రిపైనా అవినీతి ఆరోపణలు వస్తే తక్షణమే తొలగిస్తానన్నారు. మంత్రి పదవికి రెండున్నరేళ్లు గ్యారెంటీ ఉండదు.. అవినీతి మరక అంటితే ఏక్షణమైనా తొలగించేందుకు నిర్ణయం తీసుకుంటానన్నారు.

3.అలాగే మనది రైతుప్రభుత్వం.. రైతు పక్షపాతిగా ఈప్రభుత్వం ఉంటుందన్నారు.  రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది. స్పష్టం చేసారు. అందుకు తగ్గట్టుగా అందరూ పని చేయాలని కోరారు.

4.రైతు భరోసా..రైతుభరోసా పథకం అక్టోబర్ 15న ప్రారంభం అవుతుందని, ఈ పథకం ద్వారా రైతుకు రూ.12,500 అందజేస్తామన్నారు. ఈ సాయాన్ని కమర్షియల్ బ్యాంకులు రైతులకు చెల్లించలేనిపక్షంలో ప్రాథమిక సహకార బ్యాంకుల ద్వారా ఇస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఆర్థిక, వ్యవసాయ, పురపాలకశాఖ మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించారు.

5.గ్రామ వాలంటీర్లు.. ప్రతి ప్రభుత్వ పథకం గడప గడపకు చేరవేసే విధంగా గ్రామ వాలంటీర్లు పని చేస్తారు. ఆగస్ట్ 15న గ్రామ/ వార్డు వాలంటీర్ల నియామకం ఉంటుంది. గ్రామ/ వార్డు వాలంటీర్ల వ్యవస్థ త్వరితగతిన ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం. గ్రామ సచివాలయాలు అక్టోబర్ 2 నుంచి పని చేస్తాయి.  పట్టణ వాలంటీర్లు డిగ్రీ, గ్రామ వాలంటీర్లు ఇంటర్మీడియట్, గిరిజన ప్రాంత వాలంటీర్లు పదో తరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి.

6.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు..
వ్యవసాయంలో పురోగతి, రైతు సంక్షేమం, ధరల స్థిరీకరణను ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది.  ఈ కమిషన్ కు ముఖ్యమంత్రి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. 6 లేదా 7 మంది సభ్యులుంటారు. రైతు సంఘం నాయకులు, నిపుణులు ఈ కమిషన్ లో సభ్యులుగా ఉంటారు.

7.వైఎస్సార్ వడ్డీలేని రుణాలు..పంటరుణాల (క్రాప్ లోన్)కు వడ్డీలేదు. వడ్డీ కట్టలేని, కట్టని రైతులను బ్యాంకులు అడగొద్దని సూచన. రైతుల తరపున ప్రభుత్వమే ఈ వడ్డీ చెల్లిస్తుంది.  గ్రామ వాలంటీర్లు  ద్వారా ఇది అమలు జరుగుతుంది.
8.ఇన్ పుట్ సబ్సిడీ..

గత ప్రభుత్వం 2014-18 వరకు రూ.2000 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ చెల్లించలేదు. రైతు నష్టపోకుండా తక్షణమే దాన్ని రైతులకు తిరిగి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. గిట్టుబాటు ధరను సీజన్ ప్రారంభం (తొలకరి)లోనే ప్రకటిస్తారు. మార్కెట్ రేటు ప్రకారమే గిట్టుబాటు ధర ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి మండలి నిర్ణయం.

9.ప్రకృతి వైఫరీత్యాల సహాయ నిధి(కెలామిటీ రిలీఫ్ ఫండ్) కు రూ.2000 కోట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం

10. రూ.3000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి  ఏర్పాటుకు మంత్రి మండలి నిర్ణయం

11. ఉచిత బోర్లు:
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్క నియోజక వర్గంలో ప్రాధాన్యత క్రమంలో రిగ్  లు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశం. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో  ఉచిత బోర్లు వేయడానికి అందుబాటులో ఉంచాలని ఆదేశం.

12.మద్దతు ధర..ఈ సీజన్ లో ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదని ఆరోపణలు కేబినెట్ దృష్టికి వచ్చాయి. ఆ సమస్యను వెంటనే సరి చేసి మద్దతు ధర రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం.

13.రైతు బీమా..రైతులకుకి 100శాతం ఇన్సూరెన్స్ చెల్లించాలని కేబినెట్ నిర్ణయం.. ఇకపై ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. క్లెయిమ్ బాధ్యత ప్రభుత్వానిదే.. రైతులపై ఎటువంటి భారం ఉండదు.  రైతుకు లబ్ధి చేకూర్చేవరకు ప్రభుత్వానిదే బాధ్యతఅంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు

14.గృహనిర్మాణాలు..ప్రతి గ్రామంలో అర్హత కలిగి ఇళ్లులేనివారిని గుర్తించి ప్రభుత్వం ఆయాగ్రామాల్లో భూములు కొనుగోలుచేసి లబ్ధిదారులకు ఉగాది రోజున పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం. లబ్ధిదారులకు సంతృప్తి స్థాయి(సాచురేషన్)లో ఈపథకం అమలు జరిగేలా నిర్ణయం. రిజిస్ట్రేషన్ ఆఇంటి ఇల్లాలి పేరుపైనే ఉండేలా మంత్రిమండలి నిర్ణయం.

15. వైఎస్సార్ పేరు మీద రాబోయే నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం. మొదటి సంవత్సరంలో స్థలాల ఎంపిక జరుగుతుంది. మిగతా నాలుగేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రిమండలి నిర్ణయం.

16. అమ్మఒడి : బడికి తమబిడ్డను పంపే ప్రతితల్లికి రూ.15,000 ఆర్థికసహాయం అందించే అమ్మఒడి కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభం

17.సహకార రంగం పునురుద్ధరణ..సహకార రంగం పునురుద్ధరణకు తక్షణమే చర్యలు. వెంటనే చక్కెర ఫ్యాక్టరీలు పునరుద్ధరించాలని నిర్ణయం..

18.ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలను వెంటనే రద్దు చేయాలి.. ప్రత్యామ్నాయంగా ఆ ఉద్యోగులకే లబ్ధి చేకూరేలా చర్యలు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేసి లాభాపేక్షలేని సంస్థలకు ఇచ్చి ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు.

19. ఉద్యోగుల సంక్షేమం :రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1వ తేదీ నుండి 27 శాతం మధ్యంతర భృతిని(ఐఆర్) అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.815కోట్ల అదనపు వ్యయం అవుతుంది. తద్వారా 4.24 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి.

20.సీపీఎస్ రద్దు..సీపీఎస్ రద్దుకు  సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధికమంత్రి ఛైర్మన్ గా  కార్యదర్శులు సభ్యులుగా కమిటీ ఏర్పాటుచేసి దీనిపై కార్యాచరణ రూపొందిస్తారు..

21.కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ..అర్హతలు, అనుభవం ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం.. ఆర్ధికశాఖ, విద్యుత్, వైద్య శాఖ, పంచాయితీరాజ్, విద్యాశాఖ, పురపాలకశాఖ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటుచేసి త్వరితగతిన నివేదిక ఇవ్వాలని కేబినెట్ ఆదేశం.

22.శానిటేషన్(పారిశుద్ధ్యం)..అన్ని శాఖల్లోని పారిశుద్ధ్య కార్మికులకు రూ.18,000 జీతం ఇవ్వాలని కేబినెట్  నిర్ణయం. కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు..

23.వేతనాల పెంపు..మెప్మా, సెర్ఫ్ లో రిసోర్స్ పర్సన్, యానిమేటర్లకు 10వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం..

24.అంగన్ వాడీలు, హోంగార్డులులకు తెలంగాణ కంటే రూ. 1000 ఎక్కువ వేతనం ఇవ్వాలని నిర్ణయం..

25.పౌరసరఫరాలు.. ప్రస్తుతం రేషనింగ్ విధానంలో బియ్యం సరఫరా సక్రమంగా సాగడంలేదు. రిసైక్లింగ్ అవుతోంది. కాబట్టి ప్రజలకు నాణ్యమైనబియ్యం సరఫరా చేయాలని కేబినెట్ నిర్ణయం. వీటిని 5 కేజీలు, 10 కేజీలు, 15 కేజీలు బ్యాగ్స్ కింద ప్యాక్ చేసి, మరో 5నిత్యావసర వస్తువులు కలిపి గ్రామ వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. సెప్టెంబర్ కు 1 నుంచి అమలులోకి తీసుకురావాలని మంత్రి మండలి నిర్ణయం.

26.పాఠశాలలకు కొత్త రూపు..
రాష్ట్రంలో 40వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత యథాస్థితిని ఫోటోలు తీసి వాటి  పంపాలి. తద్వారా వాటి స్థితిగతులను పరిశీలించి ప్రాధాన్యతక్రమంలో దశల వారీగా మౌలిక వసతులు కల్పించడం, సంపూర్ణంగా పాఠశాలలను ఆధునీకరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయం

27. మధ్యాహ్నా భోజన పథకం : సెంట్రలైజ్డ్  కిచెన్ ఏర్పాటు చేయడం, 40 కి.మీ పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు వేడివేడిగా గుడ్డుతో సహా భోజనం అందించాలని నిర్ణయం.. వంటవారికి ఎటువంటి నష్టం లేకుండా, ఆందోళన చెందకుండా భోజనాల వడ్డించే బాధ్యతను అప్పగించి వారిని నెలకు 3వేల రూపాయల వేతనం చెల్లించాలని కేబినెట్ నిర్ణయం.

28.రాష్ట్ర విద్యా క్రమబద్దీకరణ కమిషన్ ఏర్పాటు..ఈ కమిషన్ ఏర్పాటు ద్వారా విద్యా పర్యవేక్షణ, సహేతుకమైన ఫీజు, నాణ్యమైన విద్య, ఆర్ టీఈ(రైట్ టూ ఎడ్యుకేషన్) వంటి అంశాలను సమీక్షించి మంచి విద్యా విధానాన్ని రూపొందించేందుకు చర్యలుచేపట్టాలని మంత్రిమండలి నిర్ణయం.

29.విద్యా సంస్కరణల కమిటీ ఏర్పాటు..
విద్యా సంస్కరణల కమిటీని ఏర్పాటుచేయాలని మంత్రిమండలి నిర్ణయం. దీని ద్వారా విద్యా వ్యవస్థ, ఫీజులు, మౌలిక వసతులు కల్పన, తీసుకు రావాల్సిన మార్పులు అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం.

30.ప్రతీ ప్రైవేట్ స్కూళ్లలో 25శాతం ఫ్రీ సీట్లు పేద, మధ్య తరగతి వారికి తప్పనిసరిగా కేటాయించేలా గట్టిచర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమత్రి ఆదేశం.

31.అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు స్థానిక శాసనసభ సభ్యుడు ఛైర్మన్ గా సలహా సంఘం ఏర్పాటు..

32. సరిగా లేని 108, 104 వాహనాలు స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాలని మంత్రి మండలి నిర్ణయం. దీనికి వైద్య, రవాణా శాఖలు సంయుక్తంగా బాధ్యతను తీసుకోవడమే కాక 20 నిమిషాల్లో వైద్యసౌకర్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం.

33. ఆశా వర్కర్ల వేతనాల పెంపు :ఆశా వర్కర్ల వేతనాన్ని 3వేల నుండి 10 వేలకు పెంచుతూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే గిరిజన సంక్షేమశాఖ ద్వారా ఆశావర్కర్లలా పనిచేస్తున్న 7200 మందికి వేతనాన్ని 400 నుండి 4వేల రూపాయలకు పెంపు

34.అంగన్ వాడీ కార్యకర్తల వేతనాల పెంపు..అంగన్ వాడీ కార్యకర్తలకు వేతనం 10,500 రూపాయల నుండి 11,500 రూపాయలకు పెంపు. ఆయాకు 6 వేల నుండి 7 వేలకు పెంపు.

35. అవినీతికి తావులేని ఇసుక విధానాన్ని అమలు చేయలని, ప్రస్తుత విధానాన్ని తక్షణమే నిలిపివేయాలి. ఇసుకమాఫియా సమూలంగా నిర్మూలించాలి. ఆదాయం ప్రభుత్వానికి వచ్చేలా వచ్చే కేబినెట్ లో చర్చ..

36.ఆర్టీసీ..ఆర్టీసీని రాష్ట్ర  ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. దీనిని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్  పర్యవేక్షిస్తారు.. ఈ మిటీలో రవాణా, ఆర్థికశాఖ మంత్రులుంటారు. వీరితో నిపుణుల కమిటీ కూడా ఏర్పాటవుతుంది. ఈరెండు కమిటీలు సంయుక్తంగా చర్చించి ఉత్తమ విధానంతో ముందుకువస్తారు. ప్రస్తుతం ఆర్టీసీ 6,373 కోట్ల రూపాయల నష్టంలో ఉండగా 53వేలకు పైగా ఉద్యోగులున్నారు. ఆర్టీసీని నడపడానికి ఉద్యోగుల ఖాతాల్లోంచే 2900 కోట్ల రూపాయల నిధులను చంద్రబాబు వినియోగించారు.ఎలక్ట్రిక్ బస్సులు పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. వీటికి అవసరమైన నిధులను సమీకరించే ఆలోచన చేయాలని అధికారులను ఆదేశించారు.

37.విద్యుత్ ఒప్పందాలు..ఇప్పటివరకు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను మరోసారి సమీక్షించుకోవాలని, అవినీతి రహిత విధానాన్ని రూపొందించే దిశగా విద్యుత్ శాఖా మంత్రి అధికారులు నివేదిక తయారు చేసి కేబినెట్ కు సమర్పించాలని ఆదేశించారు.

38.విద్యుత్ కోతల్లేకుండా చూడాలి..పగటి పూట 9గంటల ఉచిత విద్యుత్ ను అందించే  దిశగా విద్యుత్  శాఖా మంత్రి  కార్యాచరణ రూపొందించి ఎప్పటినుంచి దీన్ని అమల్లోకి తేవాలో వెల్లడిస్తారని మంత్రిమండలిలో చర్చించారు.

39.ఆరోగ్య శ్రీ..ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకునేలా వెసులుబాటు కల్పించాలని, ఎక్కువ వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని నిర్ణయించారు.

40. ఆవులు, గేదెల ఇన్సూరెన్స్..ఒక్కో రైతుకు 5పశువుల వరకు 15-30 వేల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించాలని, గుజరాత్, హర్యానాలో ఇటువంటి బీమా పథకం ఎలా అమలు అవుతుందో అధ్యయనం చేయాలని ఆదేశించారు.

41.పాల డెయిరీల బలోపేతం..పాల ఉత్పత్తికేంద్రాలను బలోపేతంచేసి పునరుద్ధరించేలా అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సహకార చట్టాలను కొంతమంది వ్యక్తులు కట్టుదిట్టం చేసుకున్నారని దీన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

42.అగ్రిగోల్డ్..
అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు లబ్ధి చేసేందుకు తక్షణమే 1150 కోట్ల రూపాయలను కోర్టులో జమ చేయాలని మంత్రి మండలి నిర్ణయం. 20వేల రూపాయల లోపు డిపాజిటర్లకు చెల్లింపులు చేయాలని నిర్ణయం.

43.వేరుశెనగ విత్తనాల పంపిణీ.. వేరుశనగ విత్తనాల పంపిణీ సక్రమంగా జరగట్లేదని కేబినెట్ దృష్టికి రావడంతో వెంటనే  విత్తనాల పంపిణీ రేపటి నుంచే జరగాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat