Home / 18+ / యువరాజ్ సింగ్ బయోగ్రఫీ..!

యువరాజ్ సింగ్ బయోగ్రఫీ..!

జననం:
*యువరాజ్ సింగ్ 1981, డిసెంబర్ 12 న చండీగర్ లో జన్మించారు.
*తండ్రి యోగ్‌రాజ్ సింగ్.. మాజీ బౌలర్ మరియు సినీ నటుడు.

కెరీర్ ప్రారంభం:
*యువరాజ్ తన 13వ ఏట పంజాబ్ అండర్-16 లో జమ్మూ కాశ్మీర్ తో తన మొదటి మ్యాచ్ ఆడాడు.
*1996–97పంజాబ్ అండర్-19 టీమ్ కి ఆడి హిమాచల్ ప్రదేశ్ పై అజేయంగా 137పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
*1999 సంవత్సరంలో మొహమ్మద్ కైఫ్ సారధ్యంలో ఇండియా అండర్-19 ప్రపంచకప్ గెలుచుకుంది.
*ఈ టోర్నమెంట్ లో యువరాజ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ లో అరంగ్రేట్రం:
*అండర్-19 ప్రపంచకప్ లో మెరుగైన ప్రదర్శనకు ఫలితంగా ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ చేసారు.
*యువరాజ్ 2000 సంవత్సరంలో కెన్యాతో తన మొదటి మ్యాచ్ ఆడాడు.
*తాను ఆడిన మొదటి ఇన్నింగ్స్ లోనే మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు.
*ఆ తరువాత 2001లో శ్రీలంకతో ఆడిన మ్యాచ్ లో 98పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

నాట్ వెస్ట్ సిరీస్:
*2002లో భారత్,ఇంగ్లాండ్ మధ్య నాట్ వెస్ట్ సిరీస్ జరిగింది.ఇది చాలా ప్రతిస్టాత్మక సిరీస్.
*ఇందులో సిరీస్ మొత్తం ఒక ఎత్తు అయితే చివరి మ్యాచ్ ఇంకొక ఎత్తు.
*ఈ సిరీస్ లో ఇరు జట్లు సమానంగా గెలవగా చివరి మ్యాచ్ ఎవరు గెలిస్తే వారిదే టైటిల్.
*ఈ ఫైనల్ మ్యాచ్ లో యువరాజ్ కైఫ్ తో కలిసి అద్భుతమైన బ్యాట్టింగ్ తో ఇండియాను గెలిపించాడు.

*తన మొదటి టెస్ట్ మ్యాచ్ 2003లో న్యూజిలాండ్ పై ఆడాడు.
*2007-08 సమయంలో భారత్ కు వైస్ కెప్టెన్ గా వ్యవరించాడు.

టీ20 ప్రపంచకప్:
*యువరాజ్ పేరు చెబితే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది 6బాల్స్ కి 6సిక్స్ లు.
*ఇందులో ఇంగ్లాండ్ తో ఆడిన మ్యాచ్ లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో 6సిక్ష్ లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
*టి20 క్రికెట్లో తక్కువ బంతుల్లో(12) అర్ధ శతకం సాధించిన ప్లేయర్.
*సెమీస్ లో ఆస్ట్రేలియాపై గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
*భారత్ టీ20వరల్డ్ కప్ గెలవడంలో ముఖ్యపాత్ర యువరాజ్ దే అని చెప్పాలి.

2011 ప్రపంచకప్:
*2011 ప్రపంచకప్ ఇండియాలోనే జరిగింది.ఇందులో కీలక పాత్ర యువరాజ్ దే.
*ఇందులో 300లకు పైగా పరుగులు మరియు 15 వికెట్లు తీసాడు.
*ఇప్పటి వరకు వన్డే ప్రపంచ కప్ లో అల్ రౌండర్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడు యువరాజ్.
*ఈ ప్రపంచకప్ లో నాలుగు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సాధించి సచిన్ తర్వాత ప్లేస్ లో ఉన్నాడు.

ప్రాణంతో చలగాటం:
*ప్రపంచకప్ సమయంలోనే యువరాజ్ కాన్సర్ వ్యాధితో భాదపడ్డాడు.చికిత్స అనంతరం 2012 మార్చ్ లో పూర్తిగా కోలుకున్నాడు.
*పూర్తిగా కోలుకున్న తరువాత మల్లా 2012 టీ20 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ మ్యాచ్ తో రీఎంట్రీ ఇచ్చాడు.
*ఆ తరువాత జరిగిన మ్యాచ్ లో ఏకంగా 150పరుగులు సాధించాడు.

చివరి మ్యాచ్ లు:
*2012 డిసెంబర్ 12న ఇంగ్లండ్‌పై తన చివరి టెస్ట్ ఆడాడు.
*2017 ఫిబ్రవరి 1న ఇంగ్లండ్‌పై తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.
*2017 జూన్ 30న వెస్టిండీస్ పై చివరి వన్డే మ్యాచ్ ఆడాడు.
*2019 జూన్ 10న రిటైర్మెంట్ ప్రకటించాడు.

స్కోర్ కార్డ్:
వన్డేల్లో-8701 పరుగులతో సహా 111వికెట్స్ తీసాడు.
టీ20-1177 పరుగులు మరియు 28వికెట్స్ తీసాడు.

అవార్డ్స్:
*2012లో అర్జున్ అవార్డు.
*2014లో పద్మశ్రీ అవార్డు.

 

 

 

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat