కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ యించిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎం కోరారు. ఈ మధ్యాహ్నం సీఎం కేసీఆర్.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ఫడ్ణవీస్ అంగీకరించారు. త్వరలోనే సీఎం స్వయంగా ముంబయి వెళ్లి దేవేంద్ర ఫడ్ణవీస్ను ఆహ్వానించనున్నారు.