Home / POLITICS / రేపు ముంబై వెళ్లనున్న సీఎం కేసీఆర్.. ఎందుకంటే..?

రేపు ముంబై వెళ్లనున్న సీఎం కేసీఆర్.. ఎందుకంటే..?

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం ముంబై వెళ్లనున్నారు. ఉదయం 10.20కి హైదరాబాద్ నుంచి బయలుదేరి ముంబై రాజ్ భవన్ చేరుకుంటారు. మద్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర సీఎం అధికార నివాసమైన వర్షకు చేరుకుంటారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా   దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం కేసీఆర్ స్వయంగా ఆహ్వానిస్తారు.