Home / 18+ / జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్తారా..?

జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్తారా..?

నిన్నజరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రొటెంస్పీకర్ శంబంగి చిన అప్పల నాయుడు ప్రమాణం చేయించారు.విపక్షనేత చంద్రబాబుతో సహా సభ్యులంతా ప్రమాణంచేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేసి, తన ఛాంబర్‌కు వెళ్లాక వరప్రసాద్ సీఎం ఛాంబర్‌కు వెళ్లి జగన్‌తో సమావేశమయ్యారు. ఈభేటీ తర్వాత బయటకు వచ్చి వరప్రసాద్ సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు.

రాపాక తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి జనసేన పార్టీనుంచి విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక వరప్రసాద్ వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ఆయన కూడా ఎయిర్‌పోర్టులో జగన్‌ను కలవడంతో ఊహాగానాలు నిజమే అనుకున్నారు. కానీ తాను జనసేన పార్టీని వీడనని, జగన్ పై ఉన్న అభిమానం, ముఖ్యమంత్రి పై గౌరవంతో కలిసానన్నారు. ఇదిలా ఉంటే సీఎంను రాపాక కలవగానే జనసేన కార్యకర్తలు ఆయనను ట్రోల్ చేయడం ప్రారంభించారు. పవన్ ఆశయాలను చంపేసావని, పవన్ నమ్మకాన్ని వమ్ము చేసావని, జనసేన ఇంకా చచ్చిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. దీనికి కౌంటర్ ఇస్తూ వైసీపీ సోషల్ మీడియా పిల్లలూ.. దయచేసి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. విషయం తెలుసుకోండి.. కేవలం గౌరవపూర్వకంగానే ఆయన కలిసారంటూ రిప్లై ఇస్తున్నారు.రాపాకకి జగన్ మోహన్ రెడ్డి చాలా అభిమానం ఉందని అందరికి తెలుసు.అయితే రాపాక వైసీపీలో కలిసే అవకాశం ఉందని సమాచారం.ఇదేగాని జరిగితే జనసేన పరిస్థితి ఏమిటో అందరికి తెలేసే ఉంటాది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat