Home / ANDHRAPRADESH / హోంమంత్రి మేకతోటి సుచరిత కు ఫోన్..వేంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ

హోంమంత్రి మేకతోటి సుచరిత కు ఫోన్..వేంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ

ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోంమంత్రి మేకతోటి సుచరిత పోలీసు వ్యవస్తను గాడిలో పెట్టేనా? గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థలోని కొందరు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఐపీఎస్ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు టీడీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు చేసిన వారిపైనే ఎదురు కేసులు పెట్టి వేధించిన సంఘటనలు కోకొల్లలు. ఇలాంటి సమయంలో రాష్ట్ర హోం మంత్రి గా ఒక మహిళ మేకతోటి సుచరిత భాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో మహిళల పై వేధింపులకు పాల్పడిన వారిపై ఆమె కఠిన చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు. ఇందులో బాగాంగానే అనంతపురంలో ఓ చర్చి ఫాదర్ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని తాడిపత్రిలో ఓ చర్చి నడుపుతున్న ఫాదర్ ఎమిలీ రాజు చర్చి కి వచ్చే బాలికలతో నగ్నంగా పడుకుని మసాజ్ చేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్లో ఓ బాలిక తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఫాదర్ తనకు రాజకీయంగా పోలీసులతో ఉన్న పలుకుబడిని అడ్డంపెట్టుకుని కేసు ముందుకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాడు. తాజాగా ప్రభుత్వం మారటంతో ఇకనైనా తనకు న్యాయం జరుగుతుందని బాలిక తల్లి కొత్త హోంమంత్రి మేకతోటి సుచరిత కు ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకుంది. వెంటనే స్పందించిన హోం మంత్రి ఫాదర్ ను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.