Home / SLIDER / హ్యాట్సాఫ్ కేటీఆర్

హ్యాట్సాఫ్ కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన యాబై ఆరు మంది కార్మికులు సరిగ్గా ఏడాది క్రితం దుబాయ్ లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో పనికోసం వెళ్లారు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సంస్థ మూతపడింది. దీంతో అక్కడకెళ్ళిన యాబై ఆరు మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం గురించి బాధిత కుటుంబాలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన ఆయన సౌదీ రాయబార కార్యాలయంతో చర్చలు జరిపి వారు వెనక్కి వచ్చే విధంగా తగిన ఏర్పాట్లను చేయించారు. అయితే యాబై ఆరు మందిలో ఈ రోజు సోమవారం ముప్పై తొమ్మిది మంది హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నారు..