Home / 18+ / దావూద్ గ్యాంగ్ కన్నా కోడెల కుటుంభం డేంజర్..విజయసాయి రెడ్డి

దావూద్ గ్యాంగ్ కన్నా కోడెల కుటుంభం డేంజర్..విజయసాయి రెడ్డి

టీడీపీ సీనియర్‌ నేత, మాజీస్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబ దౌర్జన్యాలు బయటపడ్డాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కే ట్యాక్స్‌ పేరుతో కోడెల కుటుంబం విచ్చలవిడిగా సాగించిన అవినీతి, అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్ష్మి చేసిన దారుణమైన దందాలు, వసూళ్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పోస్ట్ చేసారు. ప్రాధేయపడితే బందిపోట్లన్నా కొన్ని వస్తువులు వదిలి పోతారు. కోడెల కుటుంబం మాత్రం లారీలు నడుపుకుని కుటుంబాలను పోషించుకునే వారిని, రంజీ క్రికెట్ క్రీడాకారుడిని కూడా వదల్లేదని అన్నారు. రూ.15 లక్షల కంటే తక్కువ ఇస్తామంటే ముట్టనే ముట్టరంట అని చెప్పుకొచ్చారు. ముంబై దావూద్ గ్యాంగ్ వీళ్లకంటే చాలా నయం అంటున్నారు.అందుకే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బాగా బుద్ధి చెప్పారని అన్నారు.

See Also : టీడీపీ షాకింగ్ న్యూస్.. జగన్ సీఎం కావాలని జూ.ఎన్టీఆర్ కోరుకున్నారా..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat