Home / 18+ / ప్రత్యేకహోదాపై జగన్ వేస్తున్న అడుగులకు మేధావులు, విద్యావంతులు ఏమంటున్నారు.?

ప్రత్యేకహోదాపై జగన్ వేస్తున్న అడుగులకు మేధావులు, విద్యావంతులు ఏమంటున్నారు.?

నీతిఆయోగ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదాకోసం పోరాటం చేయలేదని దుష్ప్రచారం చేయడం సరికొద్ద దుమారానికి తెరలేపింది. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం స్ట్రక్చరల్ గా ముందుకెళ్తున్నారు. గత 5ఏళ్ల టీడీపీ అవినీతి, చిత్తశుద్ధిలేని పాలనతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని స్పష్టంగా నీతి ఆయోగ్ లో మాట్లాడారు. మౌలిక రంగాల్లో పెట్టుబడుల లేమి, విద్యా, వైద్య రంగాల పతనావస్థ పెరిగిపోయిందన్నారు. ప్రత్యేకహోదా మాత్రమే జీవధారగా మిగిలిందని చెప్పారు. హోదాపై ఉన్న అపోహలు ప్రచారంలో కొనసాగుతున్నాయి. 14 వ ఆర్థిక సంఘం హోదాకు వ్యతిరేకంగా ఎలాంటి సిఫార్సులు చేయలేదని ఆ కమిటీ సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖను నీతి ఆయోగ్ ముందుంచారు.

హోదా ఇవ్వాలని 2014 మార్చి2న అప్పటి కేంద్ర కేబినెట్ ప్లానింగ్ కమిషన్‌కి సిఫార్సు తీర్మానించింది. అప్పటినుంచి 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడే నాటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకి లేదని గుర్తుచేసారు. ఏపీకి హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా హోదా ఇవ్వాలని అడుగుతాయన్న వాదనపై జగన్ మాట్లాడారు. ఏపీ విభజన జరగడానికి ముందస్తు షరతుగా మాకు హామీ ఇచ్చిన హోదాకి అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటుగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పార్లమెంటులో ఉన్నారన్నారు. 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన ఉందని తెలిపారు.

See Also : పవన్ కళ్యాణ్ ఆ ఒక్కటి అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ అసెంబ్లీకి రాలేడా.?

కాబట్టి ఏపీ ప్రజలకు పార్లమెంట్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చే ఉదార స్వభావం చూపాలని ప్రధానిని కోరుతున్నానని సీఎం వైయ‌స్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్‌ తొలిసారి నీతిఆయోగ్‌ సమావేశంలో పాల్గొన్నారు. హోదా ఆవశ్యకతను, హోదా పొందడానికి ఏపీకి గల అర్హతలను వివరించారు. ప్రత్యేకహోదా ఇస్తూ గత కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం కాపీని కూడా అందజేశారు. అలాగే హోదాను రద్దు చేయలేదని చెబుతూ ప్లానింగ్‌ కమిషన్‌ అబిజిత్‌ సేన్‌ లేఖను వారికి ఇచ్చారు. 59శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 47శాతం మాత్రమే ఆదాయాన్ని పంచారన్నారు. ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని కేవలం వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. ఆందోళన వ్యక్తం చేసారు.

విభజననాటికి రూ.97 వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ.2.59 లక్షల కోట్లకు చేరింది. అప్పుల్లో అసలు, వాటిపై వడ్డీలకు కలిపి ఏడాది రూ. 40వేల కోట్ల భారం పడుతోందని చెప్పారు. అయితే ఇంత వివరంగా ఆధారాలతో సహా ఏపార్టీ కూడా ఇప్పటివరకూ హోదా అడగలేదు. చంద్రబాబు రెండుకళ్లి సిద్ధాంత వైఖరి కేవలం ఏపీకి మాత్రమే పరిమితమైంది. ఆయన పోరాటం ఢిల్లీని తాకలేదు. ఈ నేపధ్యంలో జగన్ వెళ్తున్న హోదా సాధనపై మేధావులు, విద్యావంతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలివైన, యువ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat