Home / 18+ / గరుడ పురాణంలో ఏ తప్పుకి ఎలాంటి శిక్ష ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గరుడ పురాణంలో ఏ తప్పుకి ఎలాంటి శిక్ష ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గరుడ పురాణం చాలా మందికి తెలిసే ఉంటుంది..ఎందుకంటే ఇది సూపర్ హిట్ చిత్రమైన అపరచితుడు చిత్రంలో క్లియర్ లా వివరిస్తారు.ఈ గరుడ పురాణం వేదవ్యాసుడు రాసాడు.ప్రస్తుతం ఇందులో ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కుంభీపాకం:
*అన్యాయంగా ఇతరులను హింసించి చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్షింపబడతారు.
*ఒక రాగి పాత్రలో కింద మంటపెట్టి,అందులో పాపులను శిక్షిస్తారు.

రౌరవం:
*సొంతవారి కోసం ఇతరుల ఆస్తులను అన్యాయంగా అనుభవించే వారు ఇక్కడికి వస్తారు.
*రౌరవం అంటే భయంకరమైన విషనాగు అని అర్ధం.ఇక్కడ శిక్ష చాలా కఠినంగా ఉంటుంది.

మహారౌరవం:
*వారసత్వాన్ని విడదీసి అక్రమంగా ఆస్తులు లాక్కొనే వారికి మరియు ప్రేముకురాలిని బలవంతంగా అనుభవించేవారికి ఈ శిక్ష అమలవుతుంది.
*ఇలాంటి వ్యక్తులను యముడు ఇక్కడికి పంపుతాడు.

అసితపత్రవనం:
*ఇది చాలా భయంకరమైన శిక్ష అని చెప్పాలి.
*అధికారులు తమ పనిని సక్రమంగా చేయకుండా అక్రమాలకు పాల్పడిన వారు ఈ నరకానికి వెళ్తారు.

అంధకూపం:
*ఈ శిక్ష ప్రకారం చిన్న చీమకు హాని చేసిన సరే నరకానికి వెళ్తారు.అంతేకాకుండా బంగారం, ఆభరణాలు ఇలా ఏడి దొంగతనం చేసిన శిక్ష తప్పదు.
*ఈ నరకంలో ఒక కొలిమి భగభగ మండే మంటలతో ఉంటుంది.

క్రిమిభోజనం:
*ఇంటికి వచ్చిన బంధువులను సరిగ్గా చూసుకోకపోవడం,సొంత పనులకు వాడుకొని అవసరం తీరినాక వదిలేయడం ఇలాంటి తప్పులకు ఈ శిక్ష విదిస్తారు.
*ఈ నరకం మొత్తం క్రిమికీటకాలతో ఉంటుంది.

వజ్రకంటకశాలి:
*మానవులతోనే కాకుండా జంతువులతో శృంగారం చేసేవాళ్ళకి ఈ శిక్ష విదిస్తారు.
*ఈ శిక్ష చాలా దారుణంగా ఉంటుంది.

పుయోదకం:
*పెళ్లి చేసుకునే ఆలోచన లేకపోయినా ఆడపిల్లల జీవితం నాశనం చేసేవారికి ఈ శిక్ష అమలవుతుంది.
*ఇక్కడ నరకంలో ఒక బావి ఉంటుంది.

వైశాసనం:
*అవతలి వాళ్ళు భాదపడుతుంటే వాళ్ళని చూసి ఆనందించేవారికి ఇక్కడ శిక్ష ఉంటుంది.
*భార్యను బానిసలా చూసేవారికి ఈ శిక్ష తప్పదు.

సారమేయాదానం:
*దేశాన్ని సర్వనాసం చేసేవాళ్ళకి ఈ నరకంలో శిక్ష తప్పదు.
*ఇక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి.

అయోపానం:
*ఇది ప్రత్యేకించి మందు బాబుల కోసమే ఉంది.ఇది మగవాళ్ళకు,ఆడవారికి వేరు వేరుగా ఉంటాయి.
*మనం ఎన్నిసార్లు మద్యం తీసుకున్నామో అన్నిసార్లు శిక్షలు విదిస్తారు.

శూలాప్రోతం:
*ఎదుటివారు ఎలాంటి తప్పు చేయకపోయినా అన్యాయంగా చంపేవారిని ఈ నరకానికి పంపుతారు.
*ఇది ఒకరకంగా చాలా భయంకరమైన శిక్ష అని చెప్పాలి.

దందశూకం:
*తమ పనిని తాము చేసుకుంటున్న వాళ్ళని తక్కువగా చూసినవాళ్ళకి ఈ శిక్ష విదిస్తారు.
*మనుషులను జంతువులుగా చూసేవారికి ఇది వర్తిస్తుంది.

పర్యావర్తనకం:
*ఆకలితో భాదపడుతున్న వారికి అన్నం పెట్టకపోవడమే కాకుండా వారిని తిరిగి తిట్టే వారికి ఈ శిక్ష విదిస్తారు.
*ఎక్కువ గర్వం ఉన్నవారికి ఈ శిక్ష తప్పదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat