Home / ANDHRAPRADESH / టీటీడీకి కోటి విరాళం..ఇంతకి ఈయన ఎవరో తెలుసా.!

టీటీడీకి కోటి విరాళం..ఇంతకి ఈయన ఎవరో తెలుసా.!

ఆంధ్రప్రదేశ్ లో పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకన్నకు భారీ విరాళాలు అందుతున్నాయి. తిరుమల కొండపైన ఉన్న టీటీడీ అన్న ప్రసాద ట్రస్ట్ కి భారీ విరాళం సమకూరింది.కాకినాడకు చెందిన తాతాజీ అనే పారిశ్రామిక వేత్త కోటి రూపాయల విరాళాన్ని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందించారు. తాతాజీ కుటుంబ సభ్యులతో కలసి సుబ్బారెడ్డికి చెక్కును అందచేశారు.భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద ట్రస్ట్ కు విరాళం ఇచ్చిన తాతాజీకి చైర్మన్ సుబ్బారెడ్డి అభినందించారు.