Home / 18+ / సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అమెరికా కాన్సూల్‌ జనరల్‌..

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అమెరికా కాన్సూల్‌ జనరల్‌..

అమెరికా కు చెందిన కాన్సూల్‌ జనరల్‌ క్యాథరీన్‌ బీ హడ్డా మంగళవారం ఉదయం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు.వీరి భేటీ అమరావతిలోని సచివాలయంలో జరిగింది.ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై వీరు మాట్లాడుకునట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ మరియు లోక్‌సభ, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆమె ట్విటర్‌లో అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్‌ జగన్‌కు అభినందనలు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని ఆమె ట్వీట్‌ చేశారు.ఈ సందర్భంగా గతంలో వైఎస్‌ జగన్‌తో దిగిన ఫోటోను ఆమె ట్విటర్‌లో పోస్ట్ చేసారు.