Home / 18+ / గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూ విధానం.. అడిగే ప్రశ్నలు.. అర్హతలు ఇవే

గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూ విధానం.. అడిగే ప్రశ్నలు.. అర్హతలు ఇవే

సీఎం జగన్ హామీ ఇచ్చన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే నోటిఫికేషన్ వేశారు. ఇప్పటికే 4 లక్షల మంది గ్రామ వాలంటీర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ లో 4లక్షల 33వేల 126 గ్రామ వాలంటీర్ల పోస్టులు ప్రకటించారు. గ్రామ వాలంటీర్ల

అర్హతలు..
* గ్రామ వాలంటీర్ కు ఇంటర్మీడియెట్ పాసై ఉండాలి. గిరిజన ప్రాంతాలకు సంబంధించి పదో తరగతి చదివితే సరిపోతుంది.
* వార్డు వలంటీర్ కు డిగ్రీ పాసై ఉండాలి.
* గ్రామ/ వార్డు వాలంటీర్ గా పనిచేయాలనుకునే వారు స్థానికులై ఉండాలి.
* అభ్యర్ధులు వయసు 2019, జూన్ 30 నాటికి 18 నుంచి 35 ఏళ్లు మించకూడదు.
*నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళలకు దాదాపు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది.

ఇంటర్వ్యూలో అభ్యర్థికి ఉండాల్సిన లక్షణాలు…

◆ ఇంటర్వ్యూ అనగానే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అని టెన్షన్ విద్యార్ధుల్లో ఉంటుంది. అయితే అలాంటి టెన్షన్ లేకుండా, ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు వెల్లమంటుంన్నారు నిపుణులు.
* చెప్పే సమాధానాల్లో నిజాయితీ కనిపించాలి.
* భావ వ్యక్తీకరణలో స్పష్టత.
* సామాజిక అవగాహన ఉండాలి.
* నాయకత్వ లక్షణాలు.
* ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్.
* ఇంటర్వ్యూ సమయంలో సమాధానాలను సూటిగా, స్పష్టంగా చెప్పాలి.
* అవసరమైతే ఉదాహరణలతో వివరించాలి.
* అడిగిన ప్రశ్న పూర్తికాకుండానే సమాధానం చెప్పేందుకు ప్రయత్నించకూడదు.
* ఆర్గుమెంట్ (వాదన చేయకూడదు.)

కొన్ని నమూనా ప్రశ్నలు…

* మీ గ్రామ రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి..?
* మీరు ఇంతకముందు ఏవైనా సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారా..?
* పిల్లలు మధ్యలో స్కూల్ మానేయకుండా చూడాలంటే ఏం చేస్తే బాగుంటుంది..?
* రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ‘నవరత్నాల’ గురించి చెప్పండి..?
* పిల్లలను స్కూల్ కి పంపితే ‘అమ్మ ఒడి పథకం’ కింద తల్లి ఖాతాలో ఎంత మొత్తం జమచేస్తారు..?

వాలంటీర్ విధులు..
* తమకు కేటాయించిన కుటుంబాలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను చేరవేయాలి.
* కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను చేరవేయాలి.
* తమ పరిధిలోని కుటుంబాల సమస్యలను ప్రభుత్వానికి తెలిచయజేయాలి.
* ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాలి.
* ఉన్నతాధికారులు అప్పగించిన ఇతర విధులను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది.
* పనితీరు సంతృప్తికరంగా లేకుంటే వాలంటీర్లను తొలగిస్తారు.

గ్రామ వాలంటీర్ ఎంపిక విధానం:
* తొలిదశలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. ఆ తర్వాత గ్రామాల్లో అయితే MPDO / తహసీల్దార్/EO లతో కూడిన సెలక్షన్ కమిటీ అర్హులైన అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
* ఇందులో ప్రతిభ చూపిన వారికి గ్రామ వాలంటీర్గా సెలక్షన్ కమిటీ చైర్మాన్ నియామక పత్రాలు అందిస్తారు.

ముఖ్యతేదీలు:
* దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.
* దరఖాస్తు చివరి తేదీ : జూలై 5, 2019.
* ఎంపికైన అభ్యర్ధులకు సమాచారం ఇచ్చే తేదీ : ఆగస్టు 1, 2019.
* విధులు ప్రారంభం: ఆగస్ట్ 15, 2019.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat