Home / 18+ / మూడు రికార్డుల పై కన్నేసిన యూనివర్సల్ బాస్..ఒక్క మ్యాచ్ తోనే

మూడు రికార్డుల పై కన్నేసిన యూనివర్సల్ బాస్..ఒక్క మ్యాచ్ తోనే

కరేబియన్ విద్వంసకర ఆటగాడు,యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఈరోజు తన కెరీర్ లోనే చివరి మ్యాచ్ ఆడనున్నాడు.40ఏళ్ల గేల్ కు వేరే ప్రపంచకప్ ఎలాగూ ఆడాడు కాబట్టి ఇదే అతడికి చివరి వరల్డ్ కప్ మరియు మ్యాచ్ అని చెప్పొచు.ఈరోజు వెస్టిండీస్ ఆఫ్ఘానిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది.అయితే ఈరోజు మ్యాచ్ లో ఈ సిక్సర్ల వీరుడు మూడు రికార్డులు సాధించే అవకాశం వచ్చింది,అదేమిటంటే

*ఈరోజు జరిగే మ్యాచ్‌లో గేల్‌ 18 పరుగులు తీస్తే.. విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రియన్‌లారా పేరిట ఉన్న అత్యధిక పరుగుల 295 మ్యాచ్‌ల్లో 10348 రికార్డుని బద్దలు కొడతాడు. గేల్‌ ప్రస్తుతం 294 మ్యాచ్‌ల్లో 10331 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
*ఇక 47 పరుగులు చేస్తే ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ ప్లేయర్ లారా పేరిటే ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (1225)ని అధిగమిస్తాడు.
*ఇక గేల్ శతకం సాధిస్తే వివియన్‌ రిచర్డ్స్‌ సరసన నిలుస్తాడు. ప్రపంచకప్‌లో రిచర్డ్స్‌ మూడు శతకాలు సాధించాడు.గేల్ ఇప్పుడు రెండు శతకాలతో ఉండగా ఇంకొక శతకం సాధిస్తే మూడు రికార్డులు బద్దలు కొట్టే అవకాశముంది.

ఇలా క్రిస్ గేల్ ఒక్క శతకం చేస్తే ఏకంగా మూడు రికార్డులు బద్దలుకొట్టినట్టే.మరి గేల్ ఈ రికార్డ్స్ ను బద్దలు కొడతాడో లేదో మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat