Home / 18+ / చంద్రబాబు నిర్వాకాలను పూసగుచ్చినట్టు వివరంగా చెప్పిన ఆర్ధికమంత్రి బుగ్గన

చంద్రబాబు నిర్వాకాలను పూసగుచ్చినట్టు వివరంగా చెప్పిన ఆర్ధికమంత్రి బుగ్గన

టీడీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి దీనావస్థలోకి వచ్చిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై బుధవారం శ్వేతపత్రం విడుదల చేసిన బుగ్గన 2014– 19 మధ్య ప్రజానుకూల పాలన జరగలేదని, రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. విభజననాటికి రూ. 90 వేలకోట్లు ఉన్న అప్పు.. ప్రస్తుతం “రూ. 3.62 లక్షల కోట్ల”కు చేరిందన్నారు. రూ. 66వేల కోట్లతో రెవెన్యూలోటు ఉందన్నారు. టీడీపీ హయాంలో చెల్లించాల్సిన రూ. 18 వేల కోట్ల బకాయిలను కూడా పెండింగ్లో ఉంచారని, ఉద్యోగులకు జీతాలివ్వకుండా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించారని, ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి చంద్రబాబు అప్పులు చేసారని విమర్శించారు. చేసిన అప్పులతో భవిష్యత్తు ఆదాయం వచ్చే ప్రాజెక్టులనూ కట్టలేదన్నారు. సొంత అవసరాల కోసం పథకాలు, వాటి నిర్వహణ కోసం అప్పులు చేశారని బుగ్గన మండిపడ్డారు.

చంద్రబాబు సర్కారు గత మూడేళ్లలో ఓడీలతో పరిపాలన సాగించారని, రూ.18వేలకోట్ల బిల్లులను పెండింగులో ఉంచి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ. 2.58 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. కార్పొరేషన్ల పేరుతో రూ. 58వేలకోట్ల రుణం తీసుకుందని, పౌరసరఫరా శాఖ పేరిట 18,375 కోట్ల అప్పు తీసుకుందని, అలాగే ఇతర శాఖల్లో రూ. 10,075 కోట్ల మొత్తాన్ని దారి మళ్లించి ఆ శాఖ పీడీ ఖాతాలను ఖాళీ చేశారన్నారు. 2014 –15నుంచి 2017–18 వరకు (మైనస్) -0.35, -12.28, -7.36, -15.31శాతంగా ఏపీలో రుణాత్మక వ్యవసాయ వృద్ధిరేటు నమోదైతే చంద్రబాబు అభివృద్ధి చెందుతున్నట్లుగా దొంగలెక్కలు చూపారని ఫైరయ్యారు. 2004 నుంచి 2009 వరకు 12 శాతం గ్రోత్ రేటు ఉన్న ఏపీ 2014 నుంచి 2019 మధ్య కాలంలో దారుణమైన పరిస్థితి ఎదుర్కొందన్నారు. తెలంగాణలో ఒక్కొక్కరిపై పన్ను ఆదాయం వేరే రాష్ట్రాల్లో 14,411 గా ఉంటే ఏపీలో రూ.8.397 మాత్రమే ఉందన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat