Home / MOVIES / డియర్ కామ్రేడ్‌ ట్రైల‌ర్‌

డియర్ కామ్రేడ్‌ ట్రైల‌ర్‌

టాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా హీరోహీరోయిన్లుగా మ‌రోసారి క‌లిసి న‌టించిన చిత్రం `డియర్ కామ్రేడ్‌`. భ‌ర‌త్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 26వ తేదీన విడుద‌ల‌వుతున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర‌బృందం తాజాగా విడుద‌ల చేసింది.

మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైల‌ర్‌తో క‌థ గురించి ముందే క్లారిటీ ఇచ్చారు. ఇష్ట‌మైన దాని కోసం పోరాటం చేసే యువ‌కుడిగా విజ‌య్ క‌నిపించాడు.`వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్లిపోయేటప్పుడు ఎందుకింత బాధ పెడుతోంది` అంటూ విజ‌య్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. అలాగే విజ‌య్‌, రష్మిక మ‌ధ్య లిప్‌లాక్ సీన్లను కూడా ట్రైల‌ర్‌లో చూపించారు. జస్టిన్‌ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat