Home / BHAKTHI / బుుషికేష్‌లో చాతుర్మాస్య దీక్షకు స్వామి స్వరూపానందేంద్ర శ్రీకారం.. హాజరైన దరువు ఎండీ సిహెచ్. కరణ్ రెడ్డి..!

బుుషికేష్‌లో చాతుర్మాస్య దీక్షకు స్వామి స్వరూపానందేంద్ర శ్రీకారం.. హాజరైన దరువు ఎండీ సిహెచ్. కరణ్ రెడ్డి..!

హైందవ సనాతన వైదిక ధర్మంలో అత్యంత విశిష్టమైనది…చాతుర్మాస్య దీక్ష. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి గత 15 ఏళ్లుగా ఇట్టి చాతుర్మాస్య దీక్షను క్రమం తప్పకుండా తపస్సులా కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణిమ నాడు బుుషికేష్‌లో శారదాపీఠం శాఖలో చాతుర్మాస్య దీక్షకు స్వామి స్వరూపానందేంద్ర శ్రీకారం చుట్టారు. దీక్ష ప్రారంభించే ముందు గంగానదీమ తల్లికి పసుపు, కుంకుమలతో అభిషేకం చేశారు.

ఈ రోజు గురు పౌర్ణిమ సందర్భంగా వ్యాసపూజలో శ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర బాలస్వామిలు సంయుక్తంగా పాల్గొన్నారు. తదనంతరం స్వరూపానందేంద్ర స్వామి వారికి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర గురుపూజ చేశారు.

విశాఖ శ్రీ శారదాపీఠం బుషికేష్‌ శాఖలో స్వామిజీ చాతుర్మాస్య దీక్ష అంకురార్పణ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ పురపాలక శాఖ మంత్రి హాజరై స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సారి చాతుర్మాస్య దీక్షలో పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్రతో పాటు తొలిసారిగా ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పాల్గొనడం విశేషం. విశాఖ శారదాపీఠాధిపతి చాతుర్మాస్య దీక్ష ప్రారంభం సందర్భంగా దేశం నలుమూలల నుంచి సాధుసంతులతో పాటు దండీస్వాములు తరలివచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా శారదాపీఠం భక్తులతో పాటు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్వామిజీ చాతుర్మాస్య దీక్ష అంకురార్పణ కార్యక్రమానికి “దరువు “మీడియా ఎండీ సిహెచ్ కరణ్ రెడ్డి హాజరయ్యారు. గత మూడు రోజుల కిందటే బుుషికేష్‌కు చేరుకున్న కరణ్ రెడ్డి స్వామిజీతో కలిసి పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈరోజు చాతుర్మాస్య దీక్ష సందర్భంగా గంగా నదిలో స్వామి స్వరూపానందేంద్రతో కలిసి పుణ్య స్నానం ఆచరించి, గంగమ్మ తల్లికి పూజలు చేశారు. చాతుర్మాస్య దీక్ష అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణ్ రెడ్డిని స్వామిజీ ఆశీర్వదించారు. పవిత్ర గంగా నదీ తీరాన సెప్టెంబర్ 14 వరకు స్వామివారి చాతుర్మాస్య దీక్ష కొనసాగనుంది. విశాఖ శ్రీ శారదాపీఠం బుుషికేష్‌ శాఖలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి వారి చాతుర్మాస్య దీక్ష ప్రారంభమైన సందర్భంగా బుుషికేష్‌లో ఆధ్యాత్మికత, భక్తిభావం వెల్లివిరిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat