Home / SLIDER / సికింద్రాబాద్ లో పెంచిన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణి

సికింద్రాబాద్ లో పెంచిన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణి

పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా ప్రస్తుత ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఉపశాసనసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో పెంచిన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణి కార్యక్రమం శనివారం కోలాహలంగా జరిగింది.సీతఫలమండి డివిజన్ multipurpose ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో 2009 నుంచి 2014 వరకు 6500 మందికి నెలకు కేవలం 200 రూపాయల పెన్షన్లు అందించేవారని వివరించారు. మూడు నెలలకు ఒక్క సారి ఇచ్చే ఆ పెన్షన్ డబ్బులకు దళారిలను ఆశ్రయించాల్సి వచ్చేదని, చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేదని తెలిపారు. 2014 జూన్ లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని 5 డివిజన్లలో 16 వేలమందికి పైగా లబ్దిదారులకు ఆసరా పెన్షన్లు లభిస్తున్నాయని లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు చెల్లిస్తున్నారని తెలిపారు.
 
MRO లకు సైతం పెన్షన్ దారుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించాలనే ఆదేశించానని పద్మారావు గౌడ్ తెలిపారు. పించనర్ల సమస్యలకు తమ నామలగుండు క్యాంపు కార్యాలయంలో కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారని, . కార్యాలయం ఫోన్ నెంబరు 040- 27504448లో సంప్రదించవచ్చునని పెన్షన్ పొందేందుకు ఎవ్వరు దళారిలను ఆశ్రయించవద్దని పద్మారావు గౌడ్ సూచించారు. పెంచిన పెన్షన్ల లబ్దిదారులకు అయన ఈ సందర్భంగా ధృవీకరణ పత్రాలను అందించారు. ghmc ఉప కమీషనర్ రవికుమార్, మారేడుపల్లి ఎమార్వో అనిత, కార్పొరేటర్లు సామల హేమ, భార్గవి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat