Breaking News
Home / MOVIES / జాక్‌పాట్ మూవీ ట్రైలర్

జాక్‌పాట్ మూవీ ట్రైలర్

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ జ్యోతిక 36 వయోదినిలే చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చిన సెంట్రిక్‌ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి విదితమే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో వివాహానంతరం నటిగా రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మగళీర్‌ మట్టుం, కాట్రిన్‌ మొళి చిత్రాల‌తో అల‌రించింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం జాక్‌పాట్ .

గులేభకావళి వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జ్యోతిక భర్త, నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో నటి రేవతి ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. పోలీస్‌ ఇతివృత్తంతో తెర‌కెక్కిన ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, మొట్ట రాజేంద్రన్, ఆనంద్‌రాజ్, మన్సూర్‌అలీఖాన్, జగన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఆనందకుమార్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. జాక్‌పాట్‌ చిత్రం ఆగ‌స్ట్ 2న విడుద‌ల కానుంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.