Home / MOVIES / కైకాల సత్యనారాయణ గురించి మీకు తెలియని విషయాలు..!

కైకాల సత్యనారాయణ గురించి మీకు తెలియని విషయాలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ ,లెజండ్రీ నటుడు “నవరస నటనా సార్వభౌమ” కైకాల సత్యనారాయణ ఈ రోజు తన డెబ్బై నాలుగో పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి మనకు తెలియని విషయాల గురించి తెలుసుకుందామా..?
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25 న జన్మించాడు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేశాడు.
గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మను వివాహాం చేసుకున్నాడు.
ఆయనకు ఇద్దరు కూతుళ్ళు మరియు ఇద్దరు కొడుకులు.
1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు
విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనకదుర్గ పూజా మహిమలో వేయించాడు.
ఆయన యమగోల మరియు యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు.
కృష్ణుడి గా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా నటించేవాడు
1960లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఈయనకు ఒక పాత్రనిచ్చారు.
రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించాడు
ఈ సంస్థలో కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు.
మొత్తం ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు
తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన “నవరస నటనా సార్వభౌమ” అనే బిరుదు పొందాడు.
1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి టీడీపీ నుండి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat