Breaking News
Home / SLIDER / వివో ప్రియులకు శుభవార్త

వివో ప్రియులకు శుభవార్త

ప్రముఖ స్మార్ట్ మొబైల్స్ తయారీదారీ సంస్థ అయిన వివో తన వి15 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేసిన విషయం మనకు విదితమే. కాగా ఈ ఫోన్ ధరను వివో భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌కు చెందిన రెండు రకాల ధరలను రూ.3వేల మేర తగ్గించింది. దీంతో తగ్గింపు ధరలకే ఈ ఫోన్ రెండు రకాల మోడల్స్ వినియోగదారులకు లభిస్తున్నాయి. వివో వి15 ప్రొకు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.26,990 ఉండగా రూ.3వేల తగ్గింపుతో ఈ ఫోన్ రూ.23,990 ధరకే లభిస్తున్నది. అలాగే ఈ ఫోన్‌కు చెందిన 8 జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.29,990 ఉండగా రూ.3వేల తగ్గింపుతో ఈ ఫోన్ రూ.26,990 ధరకే లభిస్తున్నది.