Home / ANDHRAPRADESH / దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ…మళ్లీ నీతులు చెబుతారు..!

దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ…మళ్లీ నీతులు చెబుతారు..!

పొద్దున లేస్తే  మా బీజేపీ ప్రభుత్వం.. అవినీతిమరక లేని ప్రభుత్వం..మా మోదీ సార్‌కు సంసార బాధలు లేవు..ఆయన ఎవరి కోసం సంపాదించే పని లేదు…దేశ ప్రజల సంపద పెంచడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు అని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే  ఉంటారు. దేశ పౌరుల వ్యక్తిగత ఆదాయ ప్రమాణాలు ఆయన పెంచడం ఏమో కాని గత ఐదేళ్లలో బీజేపీని ధనిక పార్టీగా నిలిపారు..మోదీ సార్.  ఇండియాలో 2016 నుంచి అత్యంత వేగంగా ఆస్తులను పెంచుకున్న పార్టీ బీజేపీనే అని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. ఆ సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2016-17 వ ఆర్థిక సంవత్సరంలో రూ.1213.13 కోట్ల ఆస్తులు తమకు ఉన్నట్లు బీజేపీ ప్రకటించింది. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరాని దాని ఆస్తుల విలువ రూ. 1483.35 కోట్లకు పెరిగింది…అంటే దాదాపు ఒక సంవత్సరంలోనే 2800 కోట్లకు పైగా ఆస్తులను పెంచుకుంది బీజేపీ. నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల విధానం ద్వారా వచ్చిన సొమ్ములో 90 శాతానికి పైగా బీజేపీకి సమకూరిన సంగతి తెలిసిందే. ఇక రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి భారీగా నిధులు వచ్చి పడడం ఖాయం…2019 ఎన్నికల్లోనే బీజేపీ భారీగా ఖర్చుపెట్టింది. అయితే అంతకు రెట్టింపు, ఎన్నారైల నుంచి, బడా పారిశ్రామికకవేత్తల నుంచి నిధులు బీజేపీకి వచ్చినట్లు సమాచారం.

ప్రస్తుత సంవత్సరంలో బీజేపీ ఆస్తుల విలువ రెట్టింపు అయి ఉండవచ్చు. ఇక మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్  పార్టీ ఆస్తుల విలువ రూ. 854. 75 కోట్ల నుంచి రూ.724.35 కోట్లకు అంటే 15 శాతం తగ్గింది.  ఇక తృణమూల్ కాంగ్రెస్ ఆస్తులు   రూ. 26.25 కోట్ల నుంచి రూ.29. 10 కోట్లకు అంటే 10 శాతం మాత్రమే పెరిగాయి.  అలాగే అప్పుల విషయానికి వస్తే 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 324.2 కోట్ల అప్పులు కాంగ్రెస్‌కు ఉంటే బీజేపీకి కేవలం రూ. 21. 38 కోట్ల అప్పులే ఉన్నాయి. మిగిలిన పార్టీల విషయానికి వస్తే బీఎస్‌పీకి రూ.714.97 కోట్లు, సీపీఎంకు రూ.479.58 కోట్లు, సీపీఐకి రూ.1.43 కోట్లు ఆస్తులు ఉన్నాయి. మొత్తంగా బీజేపీకి ఆస్తుల విషయంలో ఏ పార్టీ దరిదాపుల్లోకి రాకపోవడం గమనార్హం. ఒకప్పుడు సంస్థాగతంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న బీజేపీ  ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు భారీ బహిరంగ సభలు నిర్వహించడడంతో పాటు సోషల్ మీడియాకు  భారీగా నిధులు ఖర్చు చేస్తోంది.  దీన్ని బట్టి గత ఐదేళ్ల మోదీ హయాంలో బీజేపీ ఆర్థికంగా బలోపేతమైందని తెలుస్తోంది. అవినీతి మరక లేని ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కమలనాథులు తమ పార్టీకి విరాళాల చొప్పున ఎంత వసూలు చేస్తున్నారన్న లెక్కలతో పాటు, భారీగా ఆస్తులు పెరగడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat