Home / EDITORIAL / ఎడిటోరియల్: ఆర్టికల్ 370 రద్దు..అసలు ఆర్టికల్ 370 ఏం చెబుతోంది…!

ఎడిటోరియల్: ఆర్టికల్ 370 రద్దు..అసలు ఆర్టికల్ 370 ఏం చెబుతోంది…!

ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న కశ్మీరీల స్వయంప్రతిపత్తికి కారణమైన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసింది. రాజ్యసభలో ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా…370 ఆర్టికల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభ దద్దరిల్లింది. గత వారం రోజులుగా కశ్మీర్‌లో కేంద్రం భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. అమర్‌నాథ్ యాత్రికులతో పాటు, కశ్మీర్‌ నిట్ విద్యార్థులను కూడా కేంద్రం తమ స్వస్థలాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేయించింది. అయితే కశ్మీర్‌లో దాగిన టెర్రరిస్టులు, పాక్ సైన్యం సహకారంతో అమర్‌నాథ్ యాత్రికులతో పాటు, కశ్మీర్‌లోని అనేక రద్దీ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు తెగబడుతుందనే వార్తలు వచ్చాయి. అందుకే సైన్యాన్ని కేంద్రం మోహరించిందని వార్తలు వచ్చాయి. అయితే కశ్మీరీలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370తో పాటు ఆర్టికల్ 35 ఏ ను కేంద్రం రద్దు చేయనుందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇదే జరిగితే కశ్మీర్ రణరంగమే అవుతుందనే భయాందోళనలు తలెత్తాయి. అయితే ఫుల్ మెజారిటీతో ఉన్న మోడీ సర్కార్ మాత్రం ఊహించినట్లుగానే ఆర్టికల్ 370 ని రద్దు చేసింది. దీంతో పాటు ఆర్టికల్ 35 ఏ ను కూడా రద్దు అవుతోంది.

అసలు ఆర్టికల్ 370లో ఏముంది..కశ్మీరీల దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎందుకు స్వయం ప్రతిపత్తి ఉందో తెలుసుకుందాం..ఈ ఆర్టికల్ 370 ప్రకారం జమ్ము-కాశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. అంటే వారు భారత పౌరులతో పాటు తమకు తాము కశ్మీరీ దేశ పౌరుడిగా పౌరసత్వం ఉంది. అంతే కాదు జమ్ము-కాశ్మీర్ జాతీయ పతాకం భిన్నంగా ఉంటుంది.

ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో శాసనసభ్యుల పదవీ కాలం 5 ఏళ్లు ఉంటే…జమ్ము-కాశ్మీర్ శాసనసభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. జమ్మూ-కాశ్మీర్లో భారత జాతీయ పతాకాన్ని లేదా జాతీయ చిహ్నాలను అవమానిస్తే నేరం కాదు. అంతే కాదు జమ్మూ – కాశ్మీర్లో భారత సుప్రీంకోర్టు యొక్క ఆదేశం చెల్లుబాటు కాదు. భారత పార్లమెంటు నిబంధనల విషయంలో చాలా పరిమిత స్థలాలలో చట్టాలు చేయవచ్చు. ఇక ఆర్టికల్ 370 కారణంగా కశ్మీర్‌లో సమాచార హక్కు వర్తించదు.
RTE అమలు చేయబడలేదు. CAGకు ఇక్కడ తనీఖీలు చేసే అధికారం వర్తించదు..ఇలా అనేక భారత చట్టాలు వర్తించవు. ఇక ఇస్లామిక్ షరియా చట్టం కాశ్మీర్లో మహిళలకు వర్తిస్తుంది. కాశ్మీర్లోని పంచాయతీలకు హక్కులు లేవు. కాశ్మీర్లోని మైనారిటీలు అంటే హిందువులు, సిక్కులు 16% రిజర్వేషన్లు పొందలేరు.

ఆర్టికల్ 370 కారణంగా ఇతర రాష్ట్రాల్లోని భారతీయులు కాశ్మీర్లో భూమిని కొనుగోలు చేయలేరు. 370 సెక్షన్ల వలన పాకిస్థానీలకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది . కేవలం కాశ్మీర్ నుండి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలి. శాశ్వ‌త నివాసుల నిర్వ‌చ‌న‌మే 35ఏ.. జ‌మ్ము కాశ్మీర్‌కు ప్ర‌త్యేక‌గా వ‌ర్తించే అధికారాలు..హ‌క్కుల్లో భాగంగా ఈ 35ఏ చ‌ట్టం ఒక‌టి. ఇక ఆర్టికల్ 370లో భాగమైన ఆర్టికల్ 35 ఏ ప్రకారం జమ్ము-కాశ్మీర్లో, ఒక కాశ్మీరి మహిళ భారతదేశపు ఇతర రాష్ట్రంలోని ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆ మహిళకు కాశ్మీరీ పౌరసత్వం ముగుస్తుంది. వారి సంతానానికి ఇక కశ్మీర్‌లో విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు వర్తించవు. అదే

ఒక కశ్మీరి మహిళ పాకిస్తాన్‌కు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే దీనికి విరుద్ధంగా జమ్మూ – కాశ్మీర్ పౌరసత్వాన్ని పొందుతాడు.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో శాశ్వ త నివాసులు అనే అంశానికి అక్క‌డ ఉన్న వారికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పించేందుకు ఆ రాష్ట్ర శాసనసభ కు ఆర్టికల్‌ 35ఏ అధికారం ఇస్తోంది. రాజ్యాంగ సవరణ లేకుండా, పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే 1954లో ఈ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు. దీన్ని ఉపయోగించి శాసనసభ శాశ్వత నివాసులను నిర్ధారించింది.

ఈ ఆర్టికల్ 35 ఏ ప్రకారం ప్ర‌కారం 1911కు ముందు జమ్మూ కశ్మీర్‌లో జన్మించిన లేదా స్థిరపడిన వారు లేదా అంతకు కనీసం పదేళ్ల ముందు ఆ రాష్ట్రంలో స్థిరాస్తులు కొన్నవారు మాత్రమే శాశ్వత నివాసులు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌కు వచ్చిన వారెవరూ అక్కడ స్థిరాస్తులు కొనకూడదనే నిబంధ‌న ఉంది. ప్రభుత్వోద్యోగాలు చేయకూడదు. ఉపకార వేతనాలు, ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు అనర్హులు. ఓటు వేయకూడదు. ఎన్నికల్లో పోటీ చేయకూడదు. వివాహం విష‌యంలోనూ వ‌ర్తించేలా.. అదే విధంగా మ‌రింత ప‌క‌డ్బందీగా ఉందేందుకు శాశ్వత నివాసి అయిన కశ్మీరీ అమ్మాయి, శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమెకున్న హక్కులు కూడా హరించుకుపోతాయని స్ప‌ష్టంగా పేర్కొన్నారు. కానీ కశ్మీరీ అబ్బాయిల విషయంలో ఇది వర్తించదు. అయితే 2002 అక్టోబర్‌లో జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ, శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళకు కూడా హక్కులు ఉంటాయనీ, అయితే వారి పిల్లలకు మాత్రం ఏ హక్కులూ ఉండవని స్పష్టం చేసింది. దీని పైన ఆ త‌రువాత సుప్రీంలో పిటీష‌న్ సైతం దాఖ‌లైంది.

ఆర్టికల్‌ 370 ప్రకారం కశ్మీర్‌లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అధికారం కూడా కేంద్రానికి ఉండదు. కేవలం యుద్ధం లేదా బాహ్య వత్తిళ్ల వల్ల ఏర్పడే పరిణామాల నేపథ్యంలోనే కశ్మీర్‌లో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాష్ట్రంలో ఏవైనా అల్లర్ల చోటుచేసుకుంటే, ఆ సమయంలో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే కేంద్రం ఎమర్జెన్సీని ప్రకటిస్తుంది. అయితే ప్రత్యేక చట్టాల అమలు కోసం తయారైన ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని బీజేపీ భావిస్తున్నది. దాని కోసమే తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆ వాగ్దానం కూడా చేసింది. 2019లో తిరిగి తాము అధికారంలోకి వస్తే కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని మోదీ అన్నారు.

అయితే ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించకుండా, పార్లమెంటులో చర్చించకుండా అధికరణం 35ఏను రాజ్యాంగంలో చేర్చారనీ, కాబట్టి అది చెల్లదని ఢిల్లీకి చెందిన స్వ‌చ్చంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఆర్టికల్‌ 35ఏపై చర్చ అంటే దాదాపుగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్‌ 370పై చర్చగానే భావించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆర్టికల్ 370 ను కేంద్రం రద్దు చేయడంతో కశ్మీరీల స్వయం ప్రతిపత్తి రద్దు అయింది. ఆర్టికల్ 35 ఏ కూడా రద్దు అయినట్లు గానే భావించాలి. మొత్తంగా కశ్మీరీలకు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు అవడంతో ఇక వారు పూర్తిగా దేశంలో భాగమైనట్లే భావించాలి. భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించే అన్ని హక్కులు, విధులు, అమలు చేసే అన్ని చట్టాలు కశ్మీర్‌లోఅమలవుతాయి. కశ్మీరీల ద్వంద పౌరసత్వం అమల్లోకి వస్తుంది. ఇక కశ్మీర్‌లో భారత రాజ్యాంగం అమల్లోకి వస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat