Breaking News
Home / INTERNATIONAL / కశ్మీర్‌లో క్షణక్షణం ఉత్కంఠం..!

కశ్మీర్‌లో క్షణక్షణం ఉత్కంఠం..!

కశ్మీర్‌లో క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్పాయి. జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఆదివారం అర్ధరాత్రి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకుని, గడప దాటి బయటకు రావద్దని ఆదేశించారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతోపాటు రాత్రిపూట కర్ఫ్యు కూడా విధించారు. అంతేకాదు మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. మొత్తం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది కేంద్ర స్రభుత్వం. ప్రస్తుతం కేంద్రం శాటిలైట్ ఫోన్ల ద్వారా కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో జమ్ము కశ్మీర్‌లో ప్రాంతీయ పార్టీలు అన్ని ఏకమయ్యాయి.  NCP అధినేతతో ముఫ్తీ చర్చలు జరిపారు. స్వయంప్రతిపత్తికి భంగం కలిగితే సహించేది లేదన్నరు ఇతర పార్టీల నేతలు.