Breaking News
Home / CRIME / శ్రీహిత పై అత్యాచారం , హత్య చేసిన ప్రవీణ్ కు ఉరి శిక్ష

శ్రీహిత పై అత్యాచారం , హత్య చేసిన ప్రవీణ్ కు ఉరి శిక్ష

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్భన్ పరిధిలో   డాబాపై తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో కోర్టు తుది తీర్పును వెలువరించింది వరంగల్‌కు చెందిన తొమ్మిది నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం ఇటు తెలంగాణ అటు ఏపీ  రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ప్రవీణ్‌కు మరణశిక్ష విధించాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్తకంఠంతో కోరారు. చివరకు ప్రవీణ్‌కు వరంగల్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అయితే తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత పై అత్యాచారం & హత్య కేసులో వరంగల్ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు ను వెలువరించింది.అందులో భాగంగా  మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జ్ జయకుమార్ ముందు నేరం  కామోన్మాది ప్రవీణ్ అంగీకరించడంతో న్యాయమూర్తి  ఉరిశిక్ష విధించారు.