Home / SLIDER / పసుపు బోర్డుపై బీజేపీ కొత్త నాటకం..!

పసుపు బోర్డుపై బీజేపీ కొత్త నాటకం..!

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా పసుపు రైతన్నల చిరకాల వాంఛ పసుపు బోర్డు డిమాండ్‌ను నీరు గార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలను కొనసాగిస్తున్నదని పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు అవసరం లేదని రైతులతోనే అనిపించేలా ప్రణాళికలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న ఢిల్లీలో సమావేశం పేరిట ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన కుతంత్రం మరువక ముందే.. తాజాగా నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధనా స్థానంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకునే పేరిట సమావేశం నిర్వహించి నయా నాటకానికి తెరతీశారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటు వ్యవహారంలో తమ వైఖరిని స్పష్టం చేయాలని, ఐదు రోజుల్లో పసుపు బోర్డు అన్న మాటను ఏం చేశావని రైతులు ఇదివరకే నిలదీశారు.

పసుపు బోర్డుతోనే సమస్యలు తీరుతాయని ఘంటాపథంగా పునరుద్ఘ్ఘాటిస్తున్నారు. బోర్డు ఏర్పాటుపై ఈనెల 15లోగా కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని, లేదంటే మరోసారి ఉద్యమిస్తామని రైతులు, ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు స్పష్టం చేశారు. దీని సారాంశమంతా పసుపు బోర్డుపై కేంద్రం గానీ, ఎంపీ అర్వింద్ గానీ మాట తప్పినా.. కాలయాపనతో డిమాండ్‌ను నీరుగార్చే యత్నం చేసినా సహించేది లేదనే సంకేతాలు ఇప్పటికే ఇందూరు పసుపు రైతుల నుంచి వచ్చాయి.పసుపు రైతుల సమస్యలపై వారి అభిప్రాయాలను సేకరించడమే అధికారుల లక్ష్యమైతే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా ముందుగాసమాచారం ఎందుకు ఇవ్వలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నపలంగా సమావేశం నిర్వహించి బీజేపీ అనుకూల రైతులతో పసుపు బోర్డుతో పెద్దగా ఉపయోగం లేదని చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమావేశానికి హాజరైన ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు అన్వేష్‌రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి మాత్రం బోర్డు ఇవ్వాలని అధికారులకు గుర్తుచేశారు. కానీ లోక్‌సభ ఎన్నికల సమయంలో రైతులతో రోడ్లపై బైటాయించిన నాయకుడు ముత్యాల మనోహర్‌రెడ్డి మాత్రం నోరే విప్పకపోవడం గమనార్హం. పసుపు బోర్డు వచ్చే దాకా చెప్పులు వేసుకోనని శపథం చేసిన మనోహర్‌రెడ్డి కేంద్ర కమిషనర్ ముందు రైతుల మధ్య పసుపు బోర్డు కావాలని ఎందుకు అడగ లేదనే విమర్శలు బాహాటంగానే వినిపించాయి.సమావేశంలో స్వయంగా బీజేపీ నాయకుడైన ఆర్మూర్ మండలం మంథనికి చెందిన భూమారెడ్డి పసుపు బోర్డు వచ్చినా సరే రాకున్నా సరే, మద్దతు ఉంటే చాలు అని మాట్లాడటం బోర్డు డిమాండ్‌ను నీరు గార్చేలా బీజేపీ ప్రభుత్వం.. అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నదనే అనుమానాలకు బలం చేకూర్చిందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. బోర్డు ఏర్పాటు విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి బయటపడుతుందని పలువురు మండిపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat