Breaking News
Home / ANDHRAPRADESH / సీఎం జగన్‌ కీలక నిర్ణయం..తీవ్ర ఆందోళనలో చంద్రబాబు…!

సీఎం జగన్‌ కీలక నిర్ణయం..తీవ్ర ఆందోళనలో చంద్రబాబు…!

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలు కాకముందే…46 ఏళ్ల జగన్ తీసుకున్న ప్రజా సంక్షేమ నిర్ణయాలు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు నోట మాట రాకుండా చేస్తున్నాయి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను ఇటీవల మొత్తం 4 లక్షల గ్రామవాలంటీర్ల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలపైనే చర్చ జరుగుతోంది. గ్రామవాలంటీర్ల పోస్టుల నియామకంలో భాగంగా తొలుత లక్షా 33 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. దీంతో ఏపీ యువత హర్షం వ్యక్తం చేస్తోంది.

సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతిపక్ష టీడీపీకి గ్రామాల్లో విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. జన్మభూమి కమిటీల పేరుతో తన పార్టీ వాళ్లకే సర్వాధికారాలు అప్పగించి…గ్రామాల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ….తమ వర్గం వారికి, పార్టీ వారికే ప్రభుత్వ పథకాలు అందిస్తూ…అయినదానికి, కానిదానికి ప్రజల దగ్గర భారీగా కమీషన్లు వసూలు చేస్తూ… టీడీపీ నేతలు గ్రామాల్లో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. టీడీపీ నేతల దోపిడీకి గ్రామవాలంటీర్ల వ్యవస్థతో చెక్ పడనుంది. ఇన్నాళ్లు జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్న తెలుగు తమ్ముళ్లు..ఇప్పుడు గ్రామాల్లో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా ఎప్పుడైనా ఇలా ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఉందా అని నిరుద్యోగులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తెలుగు తమ్ముళ్లు బిత్తరపోతున్నారు.

గ్రామవాలంటీర్ల ఉద్యోగాల భర్తీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి పునాదులతో సహా కూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చంద్రబాబులో ఆందోళన మొదలైంది. ఇటీవల జరిగిన పోలిట్‌బ్యూరోలో కూడా గ్రామవాలంటీర్ల ఉద్యోగాల అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేస్తే…గ్రామాల్లో ఓట్లు ఏం చెప్పి అడుగుతాం అని చంద్రబాబు, పార్టీ నేతలతో వాపోయినట్లు తెలుస్తోంది. ఏదోలా గ్రామ వాలంటీర్లకు రాజకీయ రంగు పులిమేలా విమర్శలు చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశించినా అది సాధ్యం కాదని, గ్రామాల్లో కళ్ల ముందు ఉద్యోగాలు కనిపిస్తుంటే తాము చేసే విమర్శలకు ప్రజల్లో స్పందన రావడం లేదని టీడీపీ నేతలే చెప్తున్నారు.  గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ అయితే…గ్రామాల్లో టీడీపీ పని ఖతం అని బాబు భయపడుతున్నాడు.  ఏపీ సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం..టీడీపీని క్షేత్రస్థాయిలో వేళ్లతో సహా పెకిలించివేస్తుందనడంలో సందేహం లేదు.