Breaking News
Home / SLIDER / కాళేశ్వరంతో సహా రిజర్వాయర్లన్నింటిలోనూ..!

కాళేశ్వరంతో సహా రిజర్వాయర్లన్నింటిలోనూ..!

తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు అన్నింటిలోనూఈ నెల 16న భారీగా చేపపిల్లలు, రొయ్యలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాళేశ్వరం సహా అన్ని జలాశలాయాల్లో చేపపిల్లలు, రొయ్యలను విడుదల చేయాలని అధికారులకు మంత్రి లేఖ రాశారు.

ఈ ఏడాది మొత్తం 24వేల నీటి వనరులలో 80కోట్ల చేప పిల్లలు సహా 5కోట్ల రొయ్య పిల్లల్ని కూడా విడుదల చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోటి చేప పిల్లలు, 26లక్షల రొయ్య పిల్లలను మంత్రి ఆధ్వర్యంలో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని మంత్రి తలసాని ఆదేశించారు.