Breaking News
Home / MOVIES / మెగాస్టార్‌ చిరంజీవిపై హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు….!

మెగాస్టార్‌ చిరంజీవిపై హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు….!

మెగాస్టార్ చిరంజీవిని చూస్తే ఈర్ష్యగా ఉందంటూ…డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే నెగెటివ్‌ కాదండోయ్…మెగాస్టార్ రీసెంట్ లుక్ చూసి ఫిదా అయిన హరీష్ శంకర్ బాసును చూస్తే ఈర్షగా ఉందంటూ…ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. పూర్తి వివరాల్లోకి పోతే.. తాజాగా ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఫొటో షేర్ చేసిన హరీష్ శంకర్.. ”ఈ పిక్‌ని పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఫస్ట్ టైమ్ నా ఫ్రెండ్ కొరటాల శివపై ఈర్ష్యగా ఉంది. మీరు ఎలాంటి సినిమా చేయబోతున్నారో అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది” అని పోస్ట్ చేశాడు. ఇంతకీ హరీష్ శంకర్ షేర్ చేసిన ఆ పిక్‌లో మెగాస్టార్ చిరంజీవి స్లిమ్ లుక్ లో కనిపించాడు. ఈ పిక్‌ చూస్తే 30 ఏళ్ల క్రిందటి చిరంజీవిని మళ్ళీ చూస్తున్నట్లుగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. చిరు ఈ మూవీలో రెండు పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. హాకీ కోచ్‌ అని, నక్సలైట్ అని ఇలా చిరు పాత్రపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే డైరెక్టర్ కొరటాల శివ కోరిక మేరకు ఓ కేరెక్టర్ కోసం చిరు స్లిమ్‌గా తయారయ్యారు. అలా స్లిమ్‌ అయిన చిరు రీసెంట్ పిక్‌నే హరీష్ శంకర్ షేర్ చేసి..కొరటాలపై జెలసీగా ఉందంటూ.. ట్వీట్ చేశాడు. మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే హరీష్ శంకర్‌కి ఎంతో అభిమానం. గతంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయిన చిరంజీవి, హరీష్ శంకర్ తో సినిమా తీయాలనుందని అనడంతో ..ఆ టైమ్ లో చిరు పాదాలకు హరీష్ నమస్కారం చేయడంలాంటివి జరిగాయి. తాజాగా ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తూ మరోసారి మెగాస్టార్ పట్ల తన అభిమానం చాటుకున్నాడు హరీష్ శంకర్. మొత్తంగా కొరటాల శివ డైరెక్టన్‌లో రాబోతున్న మూవీలో మెగాస్టార్ లుక్‌ను రివీల్ చేశాడు హరీష్ శంకర్.