Home / SLIDER / మొక్కల పెంపకం మానవాళి మనుగడకు అవసరం

మొక్కల పెంపకం మానవాళి మనుగడకు అవసరం

మొక్కలు నాటడం మానవాళి మనుగడకు దోహదపడుతుందని రాష్ట్రవిద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.2014 కు పూర్వం చెట్లను పెంచడం కేవలం అటవీశాఖ పనిగా బావించేవారని ఆయన అన్నారు .ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారని ఆయన గుర్తు చేశారు.హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం ఇమాంపేట లో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,జిల్లా ప్రజాపరిషత్ చేయిర్మన్ దీపికా యూగందర్ రావు కలెక్టర్ అమయ్ కుమార్ తదితరులతో కలసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఏకకాలంలో నాలుగువేల మంది విద్యార్థులతో లక్ష 74 వేల మొక్కలు నాటే ఈ కార్యక్రమాన్నీ ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమ ప్రాశ్యత్యం పై విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చెట్ల పెంపకం ఒక్క అటవీశాఖకే పరిమితం చేయవద్దని అది మనందరి విధిగా భావించాలని ఉద్బోధించారు.ఏ ఒక్క సమాజంలో 33 శాతం పై చిలుకు భూములు అటవీ భూములు గా ఉంటేనే ఆ సమాజం ఆరోగ్య పరిరక్షణ ఫరీడవిల్లుతుందని హితవుపలికారు.
 
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేవలం మూడున్నర శాతం మాత్రమే అటవీశాఖ భూములలో చెట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నామని…అందులో సూర్యపేట జిల్లా కేవలం 2.4 శాతం ఉన్నట్లు తేలిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో చేపట్టిన హరితహారం ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళకాల్సిన బాధ్యత బావిభారత పౌరులపై ఉందని మంత్రి జగదీష్ రెడ్డి ఉపదేశించారు.మొక్కల పెంపకంలో రైతులపాత్ర కీలకంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని రాజునాయక్ తండాలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పర్యావరణానికి మొక్కల పెంపకం ఎంతటి ప్రాధాన్యత ఉందన్న అంశాన్ని మంత్రి జగదీష్ రెడ్డి రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో సోదాహరణంగా వివరించారు.ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రవేట్ భూములతో పాటు ప్రతి రైతు తమ తమ సొంత భూములలో కూడా కొంత భాగం చెట్ల పెంపకానికి భూములు కేటాయించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.