Breaking News
Home / ANDHRAPRADESH / జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే అరెస్ట్..?

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే అరెస్ట్..?

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ కాబోతున్నాడు. ఈ మేరకు పోలీసులు రంగం సిద్ధం చేసారు. ప్రస్తుతం రాజోలులో భారీగా పోలీసులు మొహరించారు. జూదగాల్లకు వత్తాసు పలకడం, ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసారు.మలికిపురంలో ఎస్సై కేవీ రామారావు అక్కడ పేకాడుతున్న 9 మందిని స్థానికులను అరెస్ట్ చేసారు.అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి జనసేన ఎమ్మేల్యే రాపాక వారిని వదిలేయమని అతనిని కోరగా అందుకు ఎస్ఐ నిరాకరించి వారిని వదలలేదు..ఆ తరువాత ఎస్సై నన్ను తిట్టాడు , పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాలుస్తానని బెదిరించాడని ఒక దళిత ఎమ్మేల్యేని ఇలా అవమానిస్తారా అంటూ జనసేన కార్యకర్తలతో పోలిస్ స్టేషన్ ముందు దర్నా చేసి అక్కడ అధికారులను మరియు సామాన్య ప్రజలను కాస్త బయాందోళనకు గురి చేసారు.

అక్కడితో ఆగకుండా పోలీస్ స్టేషన్ పై రాళ్ళు విసిరడంతో స్టేషన్ అద్దాలు అన్ని పలిగిలాయి. దీంతో పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించారని కేసు నమోదు చేయడం జరిగింది.ఈ మేరకు జనసేన ఎమ్మెల్యే రాపాకను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. దీంతో భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు అక్కడికి వస్తుండడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఎమ్మెల్యే రాపాక విషయానికి వస్తే ఇదివరకే ఇసుక రవాణా విషయంలో రాపాకకు సంబంధించిన ట్రాక్టర్ ను పోలీసులు అదుపులో తీసుకోవడంతో పాత పగ మనసులో పెట్టుకొని అలా చేసాడని అంటున్నారు. అంతేకాకుండా అతడిపై గతంలో కొన్ని కేసులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే కాబట్టి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో రాపాకను ఏ-1గా ఉంచారు.