Home / BHAKTHI / 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!

73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!

ఆగష్టు 15 నాడు భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. 1947 ఆగస్టు 15న భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదల అయ్యింది. దీనికి గుర్తుగా ఈరోజున భారత స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్దంలో చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమఆదీనంలోకి తీసుకున్నారు. ఇక 19వ శతాబ్దం నాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే ఆయన గౌరవాన్ని తగ్గిస్తూ రావడం జరిగింది. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగి భారత సిపాయిలు, రాజులు అందులో ఓడిపోయాకా 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాకా దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది. బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాల వల్ల భారతదేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటీష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1948లో ఈ స్వాతంత్ర్య దినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15న జరగాలని నిర్ణయించారు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. ఈ ఏడాది తో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73ఏళ్ళు అయ్యింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat