Home / SLIDER / సుపరిపాలనే మా లక్ష్యం

సుపరిపాలనే మా లక్ష్యం

సుపరిపాలన కోసం, అవినీతిని అంతమొందించడం కోసం జాఢ్యాలను, జాప్యాలను తుదముట్టించడం కోసం గ్రామాలను, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం చట్టపరమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గోల్కొండకోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్య్రం కోసం పోరాడిన త్యాగధనులకు హృదయపూర్వక నివాళులు. తెలంగాణ రాష్ర్టాన్ని సరైన దిశలో పెట్టేందుకు ఈ ఐదేళ్లలో చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. గడిచిన ఐదేళ్లుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి స్థిరంగా కొనసాగుతున్నది. అవినీతికి ఆస్కారం లేకుండా సత్వర నిర్ణయాలతో లక్ష్యాన్ని సాధించాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదిక ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 14.84 శాతం వృద్ధి రేటుతో జీఎస్‌డీపీలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ఆదాయ వృద్ధిలో స్థిరత్వం వల్ల సమకూరిన వనరులను ప్రణాళికబద్ధంగా వినియోగించడం వల్ల సంపద ఐదేళ్లలో రెట్టింపు అయింది. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణలో రూ. 4 లక్షల కోట్ల సంపద ఉండే. నేడు రూ. 8.66 లక్షల కోట్ల రూపాయాలకు చేరుకున్నాం.

పేద ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో సంక్షేమరంగానికి పెద్దపీట వేశాం. దీర్ఘకాలికంగా వెంటాడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించాం. ఆదర్శవంతమైన పాలనతో దేశం దృష్టిని ఆకర్షించగలిగాం. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం నుంచి కోలుకున్నాం. ప్రజలు కనీస జీవన భద్రతతో జీవించే దశకు తీసుకురాగలిగాం. రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశలో గడిచిన ఐదేళ్లలో పటిష్టమైన అడుగులు పడ్డాయి. రాష్ట్రం ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందడగు వేస్తుంది. ఈ ప్రగతి ప్రస్థానాన్ని నిరంతరంగా కొనసాగిస్తామనే సంకల్పాన్ని ఈ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన ప్రజలతో పంచుకుంటున్నాను. గోల్కొండ కోట వేదికగా గతంలో మనం అనేక కార్యక్రమాలను ప్రారంభించుకుని మంచి ఫలితాలు సాధించాం. అదే స్ఫూర్తితో పల్లెలను, పట్టణాలను బాగు చేసుకునే ప్రణాళికను ఆవిష్కరించాలని, సుపరిపాలన దిశగా ప్రయాణం ప్రారంభించాలని ప్రభుత్వం తలపెట్టింది. రాష్ట్రంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తున్నాయి.

సుపరిపాలన కోసం, అవినీతిని అంతమొందించడం కోసం జాఢ్యాలను, జాప్యాలను తుదముట్టించడం కోసం గ్రామాలను, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం చట్టపరమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం కోసం కొత్త పరిపాలనా విభాగాలు ఏర్పాటు చేశాం. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను ఇప్పుడు 33 జిల్లాలుగా అయింది. 43 రెవెన్యూ డివిజన్లను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలుంటే నేడు 142 అయ్యాయి. కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్యను 13కు పెంచుకున్నాం.

గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల పల్లెలను ప్రభుత్వం ప్రత్యేక గ్రామపంచాయతీలుగా మార్చింది. గతంలో గ్రామపంచాయతీలు 8,690.. ఇప్పుడు 12,751. ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఎక్కువ దక్కాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లోకల్ క్యాడర్ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకు దక్కేలా ప్రభుత్వం చట్టం చేసి, కేంద్ర ప్రభుత్వం ఆమోదాన్ని కూడా పొందింది. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. పరిపాలనా సంస్కరణలతోనే ప్రజలకు మెరుగైన పాలన అందించగలుగుతాం. పాత చట్టాలను సమూలంగా మార్చాల్చిన అవసరం వచ్చింది. అందుకే ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని, నూతన పురపాలక చట్టాన్ని తీసుకువచ్చింది. నూతన రెవెన్యూ చట్టం కూడా రూపుదిద్దుకుంటున్నది అని సీఎం కేసీఆర్ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat