Home / ANDHRAPRADESH / గ్రామ వాలంటీర్ లను హేళనగా చూస్తున్న ప్రతీఒక్కరికి ఈ సందేశం అంకితం..!

గ్రామ వాలంటీర్ లను హేళనగా చూస్తున్న ప్రతీఒక్కరికి ఈ సందేశం అంకితం..!

ఒక కుర్రోడు ఎక్కడో దూరంగా హైదరాబాద్ , వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. నెల అయ్యేసరికి ఆ కుర్రోడికి వచ్చే జీతం 15000 అనుకుందాం. ఇక ఆ కుర్రాడికి వచ్చే జీతం పక్కన పెడితే తన కర్చు ఎంత అవుతుందో ఒక్కసారి చూదాం.

*రూమ్ రెంట్ – 2000/-,
*రెండు పూట్ల తిండి ఖర్చు రోజుకి 100/- చొప్పున చూసుకున్న నెలకి 3000 అవుతుంది.

*ఉదయం, అప్పుడప్పుడు సాయంత్రం టిఫిన్ ఖర్చు నెలకి 1000/-

*ఆఫీసుకు రూమ్ కి మధ్య ప్రయాణ ఖర్చు నెలకు 1500/-..

*నెలలో ఒకసారైన ఇంటికి వెళ్తారు కాబట్టి రాను పోను చార్జీలు, మార్గ మధ్యలో ఖర్చులకు గాను 1000/- ఖర్చవుతుంది. అంతేకాకుండా నెల మొత్తంలో ఒకటి, రెండుసార్లు ఒకటో , రెండో సినిమాలు చూస్తారు. దాని నిమిత్తం 500/- ఖర్చవుతుంది.

*ఇక ఆదివారం వస్తే మిత్రులు రూమ్ కి వస్తారు. బిర్యానీ పార్టీ ఇలా చాలానే ఉంటాయి. దీనికి సంభందించి నెల మొత్తం అయ్యే ఖర్చు1000/-

*నెలలో ఫ్రెండ్స్ ఒక్కసారి ఐన సరదాగా బైటకి వెళ్దాం అంటారు.దాని నిమిత్తం ఒక 500/-.

*ఆదివారం వస్తే చాలు ఉదయాన్నేఎర్రగడ్డ మార్కెట్ కి వెళ్తారు…దాని నిమిత్తం 500/-…

మొత్తం మీద  నెలకు 11000/- వీటికే పోతాయి. ఒకవేళ మీరు ఒక జత బట్టలు కొంటె ఇంకో 2000/-.

ఈ లెక్క ఒక మాములు ఉద్యోగి కి మాత్రమే. ఇవన్నీ ఒకటి అంటే ఇక మందు అలవాటు ఉన్నవారు అయితే నెలకు 2000/-, లవర్ ఉంటే వాడికి ఇంకో 2000/-. మొత్తం మీద  నెలకు మీ ఖర్చు 13000/-… మీ ఆదాయం 15000…/-. ఈ జీతంలో మల్లా పీఎఫ్, ఇఎస్ఐ కటింగ్ లు పోను 14000/- చేతికి వస్థాయి…అంటే మీరు మిగిల్చేది 1000/-. ఒకవేళ మీ జీతం 10000/- ఐతే..ఏది ఏమన్నా మీరు నేలకి 3000/- మించి ఎక్కువ మిగల్చలేరు..పైగా కుటుంబం కి దూరంగా ఉంటారు, పండగలు, ఫంక్షన్ లు, చిన్న చిన్న సరదాలు అన్నిటికి దూరంగా బ్రతకాలి..కానీ మేము(వాలంటీర్స్) ఉన్న ఊరిలో తెలిసిన కుటుంబాలకు సేవలు అందిస్తాం… మా ఊరు అభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తాం… నలుగురు కి మంచి చేస్తాం…మాకు ఇచ్చే 5000/- లలో రూపాయి కూడా ఖర్చు ఉండదు…5000/- మిగుల్చుకుంటాం…

పైగా ఇంట్లో కుటుంబంతో కలిసుంటాం… పండగలు, ఫంక్షన్ లు, సొంత పనులు,పొలం పనులు అన్నీచేసుకుంటాం.జగనన్న రాజ్యం లో ప్రజా సేవకుడిగా బాధ్యత వహిస్తున్నందుకు గర్వం గా ఉంది  ఎవడు అయిన ఎగతాళి చేస్తే ఇలా చెప్పండి అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సమాచారం బాగా వైరల్ అవుతుంది.