Home / ANDHRAPRADESH / వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు..!

వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు..!

ఏపీలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న జనరంజక పాలన చూసి వైసీపీలో చేరుతున్నామని టీడీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు తెలిపారు. టీడీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు గురువారం వైసీపీలో చేరారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 10వేల మంది సభ్యులు ఉన్న టీడీపీ మెడికల్ వింగ్‌కు చెందిన పలువురు ట్రేడ్‌ యూనియన్ నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరిన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్నెస్సార్‌ మూర్తి మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్రేడ్ యూనియన్ నాయకులను పట్టించుకోలేదని, తమ సమస్యలు చెప్పుకుందామంటే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ని తాము కలిసి.. సమస్యలు విన్నవించుకున్నామని, తమను అక్కున చేర్చుకుని సమస్యలు పరిష్కరిస్తానని వైఎస్‌ జగన్‌ మాటిచ్చారని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat